బిగ్ రివీల్ : “మెగాస్టార్ 156” టైటిల్ అదే.. 

టాలీవుడ్ మాస్ మూల విరాట్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు తన తమ్ముడు కొడుకు వరుణ్ తేజ్ పెళ్లి సందర్భంగా ఇటలీ లో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు అయితే మెగాస్టార్ పలు భారీ చిత్రాలు తన లైనప్ లో సెట్ చేసుకోగా వాటిలో రీసెంట్ గానే తన 157వ సినిమా నుంచి 156వ సినిమాగా షిఫ్ట్ అయ్యిన చిత్రం కూడా ఒకటి.

మరి ఈ భారీ చిత్రంని అయితే టాలీవుడ్ కి మంచి ఫాంటసీ వండర్ ని ఇచ్చిన బింబిసార దర్శకుడు వసిష్ఠ మల్లాది తెరకెక్కించనున్నాడు. కాగా ఈ చిత్రం రీసెంట్ గా ముహూర్తం కూడా జరుపుకోగా త్వరలోనే షూటింగ్ జరగనుంది. అయితే ఈ గ్యాప్ లోనే ఈ సినిమాకి ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ అది కూడా బింబిసారా తరహాలోనే ఒక పౌరాణిక పీరియాడిక్ టైటిల్ అయితే లాక్ చేసినట్టుగా టాక్ రాగా ఇప్పుడు దీనిపై అసలు క్లారిటీ బయటకి వచ్చేసింది.

ఈ సినిమా క్లాప్ కార్డు పిక్ ఒకటి బయటకి రాగా దీనిపై అయితే ఇది వరకు మేము చెప్పిన టైటిల్ “విశ్వంభర” అనే క్లియర్ గా కనిపిస్తుంది. దీనితో ఈ చిత్రం టైటిల్ ఇదే అని ఇపుడు కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పాలి. ఇక ఇక్కడ నుంచి ఈ సినీ వర్గాల్లో మెగా ఫ్యాన్స్ లో అయితే బాగా వైరల్ గా మారింది.

ఇంకా ఈ భారీ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు ఈ చిత్రానికి ఆల్రెడీ 200 కోట్ల భారీ బడ్జెట్ పెట్టి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇతర వివరాలు ముందు ముందు ఈ సినిమా నుంచి రానున్నాయి. 
https://x.com/chiranjeeviarmy/status/1719642684967854174?s=20