ఇండస్ట్రీ టాక్ : “చిరు 156” కి పౌరాణిక టైటిల్??

టాలీవుడ్ మాస్ మూల విరాట్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గత చిత్రం భోళా శంకర్ తన కెరీర్ లో భారీ డిజాస్టర్ గా నిలవగా ఆ సినిమా దెబ్బతో అయితే మెగాస్టార్ మళ్ళీ స్ట్రైట్ సినిమాకే వచ్చేసారు. కాగా ఈ భారీ లైనప్ లో అయితే చిరు నటించనున్న 156వ సినిమా విషయంలో రీసెంట్ గానే పలు మార్పులు చేర్పులు చోటు చేసుకోగా ఈ చిత్రం నుంచి మేకర్స్ కూడా దసరా కానుకగా క్రేజీ అప్డేట్స్ ని అందించారు.

అయ్యితే ఇదిలా ఉండగా ఈ సినిమా విషయంలో టైటిల్ ఏంటి అనేది ఇప్పుడు ఒకటి ఆసక్తిగా మారింది. దర్శకుడు వశిష్ఠ కి పౌరాణికాల్లో పట్టు ఉన్నట్టుగా తన గత చిత్రం “బింబిసార” చూసిన వాళ్ళకి అర్ధం అయ్యింది. అదే విధంగా ఇపుడు చిరుతో సినిమా కూడా ఓ భారీ ఫాంటసీ వండర్ గా చేస్తుండగా దీనికి కూడా అదే తరహా టైటిల్ ని ఆలోచిస్తున్నట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి.

దీనితో ఈ సినిమాకి బింబిసార తరహాలోనే “విశ్వంభర” అనే ఆసక్తికర టైటిల్ ని పెట్టినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే ఫిక్స్ అని ఇంకా కన్ఫర్మ్ కాదు కానీ కావచ్చు అని అయితే వినిపిస్తుంది. మరి మేకర్స్ దీనిపై ఏదన్నా అఫీషియల్ క్లారిటీ ఇస్తారేమో అనేది చూడాలి. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ వేట ప్రస్తుతానికి కొనసాగుతూ ఉండగా ఈ సినిమా బడ్జెట్ 200 కోట్ల మేర మేకర్స్ పెడుతున్నారు. అలాగే త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.