టాలీవుడ్ నటుడు నందమూరి కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం డెవిల్ .. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహించగా.. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా రివ్యూ చూసుకుంటే.. డెవిల్ ఒక స్పై థ్రిల్లర్ అని చెబుతున్నారు అభిమానులు.
ముఖ్యంగా డెవిల్ పాత్రని తనదైన శైలిలో కళ్యాణ్ రామ్ చేశాడని.. బ్రిటిష్ నాటి సీక్రెట్ ఏజెంట్‌గా మెప్పించాడని చెబుతున్నారు. అయితే పాజిటివ్ టాక్‌తో మొదలైన ఈ సినిమా తొలి రోజు మంచి కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు చూసుకుంటే.. తొలిరోజు వరల్డ్ వైడ్‌గా రూ.4.92 కోట్ల వసూళ్లను రాబట్టింది.
కల్యాణ్‌రామ్ గత సినిమా బింబిసార తొలిరోజు రూ.9 కోట్ల వరకు వసూళ్లను సొంతం చేసుకోగా.. ఆ సినిమా దరిదాపుల్లోకి కూడా డెవిల్ నిలవకపోవడం విశేషం. ఇక సలార్ లాంటి మాస్ మసాలా మూవీకి జనాలు ఎక్కువగా వెళుతుండడంతో ఆ సినిమా కలెక్షన్లు డెవిల్ సినిమా డే 1 కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపించాయి. రానున్న రెండు రోజులు వీకెండ్ కావడంతో ఈ సినిమా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని చిత్రబృందం అలోచిస్తుంది.
సినిమా కథలోకి వెళితే.. 1945 లో బ్రిటిష్ సైన్యం నేతాజీని పట్టుకోవడాని పన్నాగాలు పన్నుతుంటుంది. నేతాజీ ఇండియా వస్తున్నారని సీక్రెట్ ఏజెంట్స్ ద్వారా బ్రిటిష్ జనరల్ కు సమాచారం అందుతుంది. అదలావుండగా.. రాసపాడు జవిూందారు కూతురు విజయని ఎవరో హత్య చేస్తారు.
ఈ కేసుని విచారించడానికి బ్రిటిష్ సీక్రెట్ ఏజంట్ డెవిల్ (కళ్యాణ్ రామ్)ని రంగంలో దిగుతాడు. తర్వాత ఏమైయింది ? అసలు నేతాజీని పట్టుకోవానికి, విజయ హత్యకు లింక్ ఏమిటనేది చిత్రకథ.