బిగ్ బాస్-6 కంటెస్టెంట్ కీర్తి భట్ జీవితంలో విషాద సంఘటన అదే.. వింటే కన్నీళ్లు ఆగవు!

కీర్తి భట్ కార్తీకదీపం సీరియల్ ద్వారా చాలామంది ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రస్తుతం ఈమె బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో మొదటి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈమె 1992లో కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది. ఈమె పూర్తి పేరు కీర్తి కేశవ్ బట్. విద్యాబాసమంతా బెంగుళూరులో పూర్తి చేసింది.

నటన అంటే ఇష్టం కావడంతో మొదట బెంగుళూరులో మోడలింగ్ లో చేరింది. తరువాత సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తుండగా 2017లో కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో ఐస్ మహల్ అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత తెలుగులో సీరియల్స్ నుండి అవకాశం వచ్చింది. ఒకసారి కుటుంబమంతా కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ప్రమాదంలో తల్లితండ్రులు, అన్నా వదినలు మరణించారు.

ఈమె డ్రైవింగ్ సీట్లో కూర్చోవడం వల్ల ప్రమాదం తప్పి మూడు నెలలు కోమాలో ఉండి ఆ తర్వాత కోలుకుంది. స్నేహితులు, బంధువులు ఎవరు పట్టించుకోలేదు. ఆస్తి అంతా బంధువులు కాజేశారు. దీంతో ఆమె డిప్రెషన్ లోకి వెళ్ళింది. కొంతకాలం తర్వాత తెలుగు సీరియల్ అయినా మనసిచ్చి చూడు సీరియల్ లో భాను పాత్రను పోషించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ హిమగా నటించింది.

ఒక చిన్న పాపను దత్తత తీసుకొని ఆ పాపకు భాను బట్ అని పేరు పెట్టి పెంచుకుంటున్నట్లు తెలుస్తుంది. మనసిచ్చి చూడు సీరియల్ లో తన పాత్ర పేరే ఆ పాపకు పెట్టింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టింది. ఈమె గతం గురించి తెలిసి బాధపడని వారంటూ ఉండరు. కీర్తి బట్ మంచి అవకాశాలతో ముందుకు రాణించాలని, ఆమె ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని దేవుని ప్రార్థిద్దాము.