కామెడీ హీరో వేణు సినిమాలలోకి రావడానికి అసలు కారణం వీరేనా!

వేణు అంటే మనకు గుర్తుకు వచ్చేది ఒక ఆరడుగుల కామెడీ హీరో. వేణు పూర్తి పేరు తొట్టెంపూడి వేణు. 1976లో ప్రకాశం జిల్లాలో జన్మించాడు. తండ్రి లెక్చరర్, ఇంకా ప్రిన్సిపాల్ గా విజయవాడ, మధురై, చెన్నైలలో పనిచేసి పదవి విరమణ చేశారు. వేణు విద్యాభ్యాసం అంతా మధురై లోనే జరిగింది. ఈయన కుటుంబ సభ్యులు బంధువులు చాలావరకు పాలిటిక్స్ లో ఉన్నారు. చదువుకునే రోజుల్లో ఇతను కూడా పాలిటిక్స్ లో వెళ్లి ప్రజలకు సేవలు చేయాలనుకున్నాడు.

2001లో తన దగ్గరి బంధువును ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నాడు ఈయనకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి ఇంటర్, అబ్బాయి టెన్త్ క్లాస్ చదువుతున్నారు. వేణు గారి మామయ్య రాజకీయంలో రాణించి ఐదుసార్లు ఎంపీగా పనిచేశారు. వేణు గారి బావమరిది కూడా రాజకీయాలలో రాణిస్తున్నారు. సినిమా అవకాశాల కోసం ఎన్నడూ రాజకీయాలను అడ్డుపెట్టుకోలేదు వేణు. ఇక సినిమాలలో రావడానికి స్నేహితులే కారణం.

బీటెక్ చదువుతున్న రోజుల్లో స్నేహితులు నువ్వు హీరోలా ఉంటావు. సినిమాలలో రాణిస్తావు అంటూ ఎంకరేజ్ ఇవ్వడం ద్వారా అప్పటినుండి సినిమాలు చూడడం ప్రారంభించాడు. విషయం తెలిసి తండ్రి మందలిచ్చినా కూడా వినకపోవడంతో ఇక నీ ఇష్టం అని చెప్పేశారట. తరువాత చెన్నై వెళ్లి సినిమా అడిషన్లను చేస్తూ అన్ని ఆఫీసులలో తన ఫోటోలను ఇచ్చేవారట. అవకాశాల కోసం బాగానే కష్టపడ్డారు వేణు.
మొదటగా భారతీ రాజా దర్శకత్వంలో ఒక సినిమాలో హీరోగా ఛాన్స్ వచ్చింది.

కానీ కొన్ని అవాంతరాల కారణంగా ఆ సినిమా ఆగిపోయింది. వేణు స్నేహితులైన వెంకటశ్యామ్ ప్రసాద్ ఎస్పీ ఎంటర్టైన్మెంట్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించాడు. ఆ సంస్థ సారధ్యంలో కే. విజయభాస్కర్ దర్శకత్వంలో 1999లో స్వయంవరం అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇందులో ఈయన సరసన లయ గారు నటించారు. ఈమెకు కూడా ఇది మొదటి సినిమా. ఈ సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమా ద్వారా నంది అవార్డు కూడా తీసుకున్నారు. తరువాత ఈ సంస్థ సారధ్యంలోనే 2000 సంవత్సరంలో వచ్చిన చిరునవ్వుతో అనే సినిమాలో నటించారు.

ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇలా వరుస విజయాలతో కొంతకాలం ప్రేక్షకులను అలరించి తరువాత సినిమా అవకాశాలు తగ్గాయి. చింతకాయల రవి సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్, దమ్ము సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేసిన తర్వాత పది సంవత్సరాల వరకు తెరపైకి రాలేదు వేణు. అయితే ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ సినిమా ద్వారా మళ్ళీ తెరపై కనిపించారు వేణు.