నటుడు జయప్రకాశ్ రెడ్డి కోట్ల డబ్బు కోల్పోవడానికి కారణం ఇదే అంటున్న నటుడు రఘునాథ్ రెడ్డి!

రఘునాథ్ రెడ్డి తెలుగు చలనచిత్ర నటుడు. విలన్ గా, సహాయ పాత్రలలో దాదాపు 400 చిత్రాలలో నటించాడు. ఈయన విజయవాడలో జన్మించాడు. ఇతను అన్నపూర్ణను వివాహం చేసుకున్నాడు వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. 1991లో శోభన్ బాబు నటించిన సర్పయాగం చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు.

ఇలా వరుస అవకాశాలతో దూసుకుపోతూ మంచి పేరు, ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. యూట్యూబ్ ఛానల్ వారు నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో భాగంగా సినీ జీవితంలో తన సన్నిహితులు, నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఇందులో భాగంగా పలు చిత్రాల్లో విలన్ గా, కొన్ని కామెడీ సన్నివేశాల్లో నటించి ఎంతగానో అలరించిన స్వర్గీయ జయప్రకాశ్ రెడ్డి తనకు అత్యంత సన్నిహితుడని, అంతేకాకుండా తనని ఎప్పుడూ మామా అని పిలిచేవాడు అని పేర్కొన్నాడు.

విలన్ గా కంటే కామెడీ సన్నివేశాలే జయప్రకాష్ రెడ్డికి బాగా సూట్ అవుతాయి. ఆ పాత్రల వల్లనే కొన్ని అవార్డులు కూడా తీసుకోవడం జరిగింది అని చెబుతూ అంత చనువు మా మధ్య ఉందని పేర్కొన్నాడు. అయితే జయప్రకాశ్ రెడ్డి సినిమాలలోకి రాకముందు విద్యా బోధన సంస్థలకు చెందిన ఒక ప్రాజెక్టును చేశాడని, సరిగ్గా ఆ సమయంలోనే సినిమా అవకాశం రావడంతో ప్రాజెక్టు వదులుకున్నాడని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

జయప్రకాష్ రెడ్డి సినిమాలలోకి వచ్చిన తర్వాత అతని ప్రాజెక్ట్ ఫార్ములాను వేరే వాళ్ళు వినియోగించుకొని కొన్ని కోట్లు సంపాదించుకున్నారు అని పేర్కొనడం జరిగింది. జయప్రకాశ్ రెడ్డి సినిమాలలో రాకుండా ఆ ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే అత్యధికంగా డబ్బులు సంపాదించి ఉండేవాడని తెలిపాడు. జయప్రకాష్ రెడ్డి చనిపోయే ఒక నెల ముందు తనతో మాట్లాడి చాలా ఎమోషనల్ అయ్యాడని, సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడని తెలిపాడు.