చెక్కుల కోసం ఏమైనా చేస్తావా…? అందరి ముందు అన్నపూర్ణమ్మ పరువు తీసిన ఆది..!

అలనాటి సీనియర్ నటీమణులు కూడా ఈ మధ్యకాలంలో బుల్లితెర మీద బాగా సందడి చేస్తున్నారు. సీనియర్ నటి అన్నపూర్ణమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని వందల సినిమాలలో ప్రధాన పాత్రలలో నటించిన అన్నపూర్ణమ్మ ఇప్పుడు బుల్లితెర మీద సందడి చేస్తోంది. ఈటీవిలో ప్రసారమవుతున్న శ్రీదేవీ డ్రామా కంపెనీ షో ఇలాంటి సీనియర్ ఆర్టిస్టులకు మంచి అవకాశాలు కల్పిస్తున్నారు. వెండి తెర మీద అవకాశాలు తగ్గి ఇబ్బంది పెడుతున్న ఎంతోమంది సీనియర్ నటుల కు ఈ షో ద్వారా రెగ్యులర్ గా పని దొరికింది.

గత కొన్ని రోజులుగా అన్నపూర్ణమ్మ శ్రీదేవీ డ్రామా కంపెనీ షో తో పాటు ఈటీవీ వారు నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలలో తన కామెడీతో సందడి చేస్తోంది. ఈవారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా అన్నపూర్ణ కొత్త అవతారంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల అయింది. ఈ ప్రోమోలో అన్నపూర్ణమ్మ శ్రీవల్లి గెటప్ లో దర్శనమిచ్చింది. ఈ క్రమంలో అన్నపూర్ణమ్మ మీద హైపర్ ఆది సెటైర్లు వేసాడు. ఇలా ఆది పంచ్ లతో ఈ వారం ఎపిసోడ్ కూడ ప్రేక్షకులను ఆకట్టుకోబోతోంది

తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీ షో 75వ ఎపిసోడ్ లో పుష్ప సినిమా స్పూఫ్ చేశారు.అందులో భాగంగా అన్నపూర్ణమ్మ శ్రీవల్లి గెటప్ లో రాగానే అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు. అన్నపూర్ణమ్మ వచ్చి రాగానే తగ్గేదే లే అని డైలాగ్ చెప్పింది. వెంటనే ఆది ఏంటీ ఆయాసమా? అని పంచ్ వేస్తాడు. ఇక తర్వాత అన్నపూర్ణమ్మ శ్రీవల్లి అందం గురించి మాట్లాడుతూ.. ఇన్నేళ్లైన నా అందం కొంచం కూడా చెక్కు చెదరలేదు అని అంటుంది. అప్పుడు ఆది మల్లెమాల వారు ఇచ్చే చెక్కుల కోసం ఇలాంటివి చేస్తావా? అంటూ అందరి ముందు ఆమె పరువు తీశారు. ప్రస్తుతం ఈ ప్రోమో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది.