Dil Ramesh: ఆస్తులన్నీ అమ్ముకొని ఇండస్ట్రీకి వస్తే అన్నపూర్ణ గేట్ కూడా దాటనివ్వలేదు: దిల్ రమేష్

Dil Ramesh: ప్రయత్నం చేసి సాధించాలి గానీ ఎక్కడో ఉండి కలలు కంటే ఏం లాభం అని సినీ ఆర్టిస్ట్ దిల్ రమేశ్ అన్నారు. 22 ఏళ్లలో ఓ స్కూలు పెట్టిన తాను, ఇంత సక్సెస్ అవుతుందనుకోలేదని, మరి అది అయినప్పుడు తాను సినీ ఇండస్ట్రీలోకి వెళ్లాలనుకోవడం ఎందుకు కాదు, అది కష్టం అయినప్పుడు ఇది కూడా కష్టమే కదా… మన ప్రయత్నం సిన్సియర్‌గా ఉండాలనుకొని ఇక్కడికి వచ్చేశానని ఆయన చెప్పుకొచ్చారు. వచ్చిన కొత్తలో తనకు అసలు అన్నపూర్ణ స్టూడియోస్ ఎక్కడ ఉందో కూడా తెలియదని, తమ రిలేటివ్స్‌లో ఎవరికీ కూడా ఈ ఫిలిం బ్యాగ్రౌండ్ లేదని, వాటి గురించి ఏం తెలియదని ఆయన అన్నారు. అయినా కూడా తాను ఇక్కడికి వచ్చానని ఆయన చెప్పారు.

కానీ తనకు ఇక్కడకు వచ్చిన 3 రోజుల్లోనే తెలిసిందేమిటంటే, ఇలాగే ఉంటే ముసలి వాళ్లమైతే అవుతామేమో గానీ, ఆర్టిస్ట్‌ మాత్రం కాలేనని ఆయన అనుకున్నట్టు దిల్ రాజు చెప్పారు. ఇది ప్రాపర్ ప్రాసెస్ కాదు, మనకు తెలియకుండా వచ్చామని రియలైజ్‌ అయిపోయి, విత్‌ఇన్ వన్ వీక్‌లో, అంటే నేను యాక్టర్ అవ్వాలనే ఉద్దేశంతో ఫర్నీచర్ కొని, రెంట్‌కు పెద్ద ఇల్లు తీసుకొని, ఇవన్నీ అయిపోయి, మనం వెళ్లిపోతే ఎవడో ఒకడు ఇస్తాడనే నమ్మకంతో ఇప్పటికీ చాలా మంది ఇండస్ట్రీకి వస్తున్నారని, అలా రాకూడదని ఆయన చెప్పారు. ముందు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఏమిటి? ఇక్కడ ఎలాంటి పరిస్థుతులుంటాయి.. ఇవన్నీ తెలుసుకొని రావాలని ఆయన స్పష్టం చేశారు.

అలా కొన్ని ప్రయత్నం చేసినా ఎలాంటి ఫలితం లేకపోయేసరికి ఈనాడులో జూనియర్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా చేరానని, ఆ తర్వాత మళ్లీ ఇండస్ట్రీకి రావలన్న ఇష్టంతో ల్యాబ్‌కి వచ్చానని ఆయన చెప్పారు. అక్కడ కూడా తన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసిన నాగినీడు గారు తనకు ల్యాబ్‌లో జాబ్ ఇవ్వనని అన్నారని ఆయన చెప్పారు. ఆర్టిస్ట్‌ అవడం అనేది అంత ఈజీ కాదు.. నువ్వు చెడిపోతావు అని ఆయన తనతో అన్నారని దిల్ రమేశ్ అన్నారు.