హైదరాబాద్: తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా తయారైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది . దుబ్బాక ఉప ఎన్నికలో అయినా కాంగ్రెస్ గెలిచి పరువు దక్కించుకుంటుందేమో అనుకున్నారు కానీ అక్కడ మూడో స్థానానికి పరిమితమై పరువు తీసేసుకుంది.ఇక గ్రేటర్ లో రెండు సీట్లు దక్కించుకుని ఉన్న పరువును కూడా పోగొట్టుకుంది.
ఓటమికి బాధ్యత వహిస్తూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ పదవికి రాజీనామా చేశారు. కాళీగా ఉన్న టిపిసిసి చీఫ్ పదవికి సరైన నాయకుడిని ఎన్నుకునే బాధ్యతని హై కమాండ్ ఇన్‌ఛార్జి మణికం ఠాగూర్ కి అప్పగించింది . పిసిసి చీఫ్‌ను ఎన్నుకోవటానికి కాంగ్రెస్ తొలిసారిగా మాజీ ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎంఎల్‌సిలు, జిల్లా అధ్యక్షులుతో విస్తృత సంప్రదింపులు జరిపింది.దానికనుగుణంగా ఇన్‌ఛార్జి మణికం ఠాగూర్ సంప్రదింపులు ముగించారు. కానీ ఠాగూర్ ఎంపిక సరైనది కాదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు.పార్టీ హైకమాండ్‌కు ఆయన ఏకపక్ష నివేదికను సమర్పించవచ్చని కొందరు అంటున్నారు.
ఠాగూర్ గాంధీ భవన్ వద్ద సంప్రదింపులు హాజరుపుతున్నప్పుడు , అదే సమయంలో టి ఎమ్ జయప్రకాష్ రెడ్డి, శ్రీధర్ బాబు, పోడెం వీరయ్య, ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సిఎల్పి కార్యాలయంలో సమావేశమయ్యారు. మీడియా తో మాట్లాడుతూ… “ సోనియా మరియు రాహుల్ గాంధీలకు సరైన సమాచారం తెలియజేయడం లేదు, అభిప్రాయాలు కోరే మొత్తం ప్రక్రియపై మాకు సందేహాలు ఉన్నాయి ” అని జయప్రకాష్ రెడ్డి అన్నారు. మాజీ పిసిసి చీఫ్ మాట్లాడుతూ… మొదటి రెండు రోజులలో ఎఐసిసి కార్యదర్శులు ఎన్‌ఎస్ బోస్ రాజు, శ్రీనివాసన్ కృష్ణన్ హాజరుకాకుండా సంప్రదింపులు జరిగాయని సూచించారు. “ఠాగూర్ ఒకరితో ఒకరుగా విడిగా సమావేశాలను నిర్వహించారు. రేవంత్ రెడ్డికి మెజారిటీ నాయకులు మద్దతు ఇస్తున్నారని ఆయన పార్టీ హైకమాండ్‌కు నివేదిక ఇవ్వవచ్చు ” అని అన్నారు. ఇంకా, మణికం ఠాగూర్, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ రేవంత్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీన్ని బట్టి పీసీసీ చీఫ్ పదవి ఎక్కడ రేవంత్ రెడ్డికి ఇస్తారోనని వారంతా కంగారు పడిపోతున్నట్లుగా అర్ధమవుతుంది. రేవంత్ రెడ్డి కి పీసీసీ చీఫ్ పదవి దక్కకుండా చెయ్యటానికి చాలా కుట్రలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతుంది.