పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ గేమ్ ప్లాన్ మార్చాల్సిందే.!

జనసేన పార్టీని వైసీపీ చాలా చాలా లైట్ తీసుకుంటోందా.? ఒకప్పుడు లైట్ తీసుకుందేమోగానీ, ఇప్పుడు మాత్రం సీరియస్‌గానే తీసుకుంటోంది. లేకపోతే, పదే పదే ‘దత్త పుత్రుడు’ అంటూ జనసేనాని మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎందుకు విమర్శలు చేస్తారు.?

పైకి మాత్రం లైట్ తీసుకుంటున్నట్లు వైసీపీ కనిపిస్తోంది అంతే. ఒక్కమాటలో చెప్పాలంటే, వైసీపీ నటనా ప్రతిభకు ఎవరైనా హేట్సాఫ్ చెప్పి తీరాలి ఈ విషయంలో. ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో వైసీపీ మీద జనసేన ప్రభావం వుండి తీరుతుంది. ఆ సంగతి వైసీపీకి కూడా తెలుసు. కానీ, జనసేన పార్టీని టీడీపీకి అంటగట్టేస్తే, తాము సేఫ్.. అన్న భావనలో వుంది వైసీపీ. ఇదే వైసీపీ కొంప ముంచేలా వుంది.

జనసేన పార్టీ జనంలోకి వెళ్ళిపోతోంది. సరే, జనసేనాని వీకెండ్ హంగామా చేస్తారా.? ఆయనకు రాజకీయాలంటే ఆటలుగా వుందా.? అన్నది వేరే చర్చ. అది జనం డిసైడ్ చేస్తారు. కానీ, జనసేన తెరపైకి తెస్తున్న చాలా ప్రజా సమస్యలు.. నిజంగానే వున్నాయ్.. వాటి పట్ల జనం ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు.

ఒకప్పటిలా జనం రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వాల మీద ఆందోళన చేయడం అనేది ఈ మధ్యకాలంలో కనిపించడంలేదు. కానీ, ఖచ్చితంగా ఇంపాక్ట్ వుండి తీరుతుంది. రోడ్ల సమస్య ఒక్కటే కాదు, చాలా సమస్యలున్నాయ్. తమ గడప వద్దకు వస్తున్న వైసీపీ ప్రజా ప్రతినిథుల్ని ప్రజలు తరిమికొడుతున్న తీరుతో అయినా వైసీపీ అధినాయకత్వం అప్రమత్తమైతే మంచిది.

లేదంటే, టీడీపీ సంగతేమోగానీ.. జనసేన పార్టీ వైసీపీని తొక్కి, అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని వుండదు. అది అంత తేలిక కాదుగానీ, ఆ ఛాన్స్ జనసేనకి వైసీపీనే ఇచ్చేలా వుంది.