2019 ఎన్నికలకు ముందు.. జగన్ పాదయాత్ర జోరుగా సాగుతున్న సమయంలో.. టీడీపీ అధికారంలో ఉన్న టైమ్ లో విశాఖలో టీడీపీ నేతల మధ్య పెద్ద పోరు నడిచింది. విశాఖలో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఒకటి గంటా వర్గం, ఇంకోటి గంటా యాంటీ వర్గం. అది అప్పట్లో చంద్రబాబు కు తీవ్రంగా తలనొప్పిని తీసుకొచ్చింది.
గంటా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. ఆయన్ను మంత్రి పదవి నుంచి తీసేయండి.. లేదంటే పార్టీ పరువు పోతుంది.. అంటూ కొందరు విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వచ్చి బాబుకు మొరపెట్టుకున్నారట.
మీరు ఇలాగే చిన్నపిల్లల్లా కొట్టుకుంటూ ఉండండి. మధ్యలో జగన్ అధికారంలోకి వచ్చేస్తాడు. అప్పుడు ఏం చక్క అందరం కలిసి కొట్టుకోవచ్చు. మీరు ఇలాగే చేస్తే మనం ఓడిపోవడం ఖాయం.. జగన్ వచ్చాక మామూలుగా ఉండదు. అందరినీ ఓ ఆట ఆడుకుంటాడు.. అంటూ చంద్రబాబు అప్పట్లోనే జోస్యం చెప్పారట.
పైనుంచి తథాస్తు దేవతు తథాస్తు అన్నారో ఏమో కానీ.. నిజంగానే చంద్రబాబు చెప్పినట్టే జరిగింది. చంద్రబాబు ఘోరంగా ఓడిపోయారు. జగన్ గెలిచారు. ఇప్పుడు టీడీపీ నేతలతో ఓ ఆట ఆడుకుంటున్నారు.
ఇక.. వరుస పెట్టి టీడీపీ బడా లీడర్లపై టార్గెట్ ఫిక్స్ చేశారు జగన్. ముందుగా ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని బుక్ చేసిన జగన్… బందరు హత్యకు కొల్లు రవీంద్రకు లింక్ పెట్టారు. ఇద్దరూ మటాష్.
ఇప్పుడు జగన్ టార్గెట్ దేవినేని ఉమ. ఆయన్ని మూసేస్తే టీడీపీ పని ఇక అయిపోయినట్టే అని జగన్ భావిస్తున్నారు.. అనేది రాజకీయ వర్గాల ఆరోపణ. అందుకే.. పుష్కరాల పనుల అవినీతిపై విచారణను వేగవంతం చేశారు. అప్పట్లో ఈ పనులు చేయించింది దేవినేని ఉమే.
నిజానికి పుష్కరాల పనుల్లో అవినీతి జరిగింది. అక్కడ అధికారులు అవినీతి చేశారా? లేక రాజకీయ నేతలు చేశారా? లేక ఇంకెవరైనా చేశారా? అనేది పక్కన పెడితే.. పుష్కరాల పనులను దగ్గరుండి చేయించిన మాజీ మంత్రి దేవినేని ఉమ మీదికే అన్ని ఆరోపణలు వెళ్తాయి. అందులోనూ పుష్కరాల పనులను నిర్వహించిన అధికారులను పట్టుకుంటే.. అసలు పేర్లు ఈజీగా బయటికి వస్తాయి. దీంతో దేవినేని ఉమను మూసేయొచ్చు.. అనేదే వైఎస్ జగన్ ప్లాన్ అని టాక్.
అయితే.. ఇవన్నీ ఉత్తుత్తి లెక్కలే. అచ్చెన్నాయుడు మీద పెట్టిన కేసు ఎన్నో రోజులు నిలబడదు. అలాగే కొల్లు రవీంద్రది కూడా. అవన్నీ ఆధారాలు పరిపూర్ణంగా లేని కేసులు. ఇప్పుడు పుష్కరాల కేసు కూడా అటువంటిదే. కానీ.. జగన్ ప్రభుత్వం.. టీడీపీ బడా లీడర్ల పాయింట్లు తడిపింది అనేది గుర్తు పెట్టుకుంటే చాలు.. అంటూ వైసీపీ శ్రేణులు అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది.