రాజకీయాలు చేయడానికి పెద్ద పెద్ద సమస్యలు ఉండాల్సిన అవసరం లేదు. ఒక ఇల్లు ఉన్నా సరే దాని చుట్టూ కొన్ని సంవత్సరాల పాటు రాజకీయాలు చేయవచ్చని వైసీపీ నాయకులు నిరూపిస్తున్నారు. అమరావతికి పొంచి ఉన్న కృష్ణ నది వరద నీటిని అడ్డుపెట్టుకొని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ నాయకులు గత కొన్ని రోజుల నుండి చాలా రాజకీయాలు నడుపుతున్నారు. అమరావతి, ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు అద్దెకు ఉంటున్న ఇంటి చుట్టూ వైసీపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారు.
అద్దె ఇంటి చుట్టూ వైసీపీ రాజకీయాలు
కరకట్ట ప్రాంతంలో వున్న చంద్రబాబు ఇంటిని (చంద్రబాబు అద్దెకు వుంటోన్న ఇల్లు) కూల్చేందుకు వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. అది అక్రమ కట్టడం.. అంటూ నోటీసులు కూడా పంపారు అధికారులు. కానీ ఏడాది కాలంలో అధికార వైసీపీ, ఆ ‘అక్రమాల్ని’ బయటపెట్టలేదు.. ఆ గెస్ట్ హౌస్ కూల్చివేత జరగలేదు. కానీ ప్రజలకు ఉపయోగపడే అధికారిక నిర్మాణం ప్రజా వేదికను మాత్రం కూల్చి పారేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం.
మాట మార్చిన వైసీపీ నాయకులు
ఇప్పుడు మళ్ళీ కృష్ణా నదికి వరదొచ్చింది. చంద్రబాబు నివాసం వుంటోన్న ఇల్లు సహా, కరకట్టను ఆనుకుని వున్న అనేక నిర్మాణాలకు మళ్ళీ నోటీసులు వెళ్ళాయి. ఈసారి ఇదివరకటిలా కూల్చేస్తామని మాత్రం కాదు, వరద వచ్చే అవకాశం వుంది గనుక, ఖాళీ చేయాలని మాత్రమే. గతంలో అక్రమ కట్టడం కూల్చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు ఎందుకు కేవలం ఖాళీ చేయాలని మాత్రమే నోటీసులు ఇచ్చిందని రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. గతంలో ఇంటి ఓనర్ లింగమనేనిని వైసీపీ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు అన్ని ఇన్నీ కాదు. అయితే ఇప్పుడు చంద్రబాబు ఇంటి విషయంలో రాజకీయాలు చేసిన వైసీపీ సడెన్ గా ఎందుకు ఈ ప్లేట్ మార్చిందో వేచి చూడాలి. ఈ ఇంటి రాజకీయాలు ఇంకెంత దూరం వెళ్తుందో వేచి చూడాలి.