HomeAndhra Pradeshతిరుమల వెళ్ళినప్పుడు వైసీపీ నేతలు కూసింత అత్యుత్సాహం తగ్గించుకుంటే మంచిది

తిరుమల వెళ్ళినప్పుడు వైసీపీ నేతలు కూసింత అత్యుత్సాహం తగ్గించుకుంటే మంచిది

అధికార పార్టీ మీద విమర్శలు చేయడానికి ప్రతిపక్షాలు ఎప్పుడూ ముందుంటాయి.  చిన్న చిన్న విషయాలను కూడ భూతద్దంలో చూపించి బద్నాం  చేయాలనుకుంటాయి.  కాబట్టి పాలకవర్గమే ఎక్కువ అప్రమత్తతతో ఉండాలి.  లేకపోతే ప్రతిపక్షాల పన్నాగాలకు ఇబ్బందిపడాల్సి వస్తుంది.  ఈ సంగతి తెలిసి కూడ వైసీపీ నేతలు పదే పదే ప్రతిపక్షాల చేతికి చిక్కిపోతున్నారు.  ప్రధానంగా తిరుమల విషయంలో మాటిమాటికీ విమర్శలకు గురవుతున్నారు.  తిరుమల కొండ మీద హిందూత్వాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని టీడీపీ మొదటి నుండి ఆరోపణలుచేస్తూనే ఉంది.  అన్యమత ప్రచార బృందాలు తిరుమలలో మకాం వేశాయని, వారికి జగన్ సర్కార్ అండ పుష్కలంగా ఉందని చెబుతూ వస్తున్నారు.  వారి విమర్శలకు బలాన్ని చేకూర్చేలా అన్యమత ప్రచార ఆనవాళ్లు పలుమార్లు వెలుగుచూశాయి.  
Ysrcp Leaders Should Slow Down In Tirumala
YSRCP leaders should slow down in Tirumala
అసలే హిందూత్వ ఎజెండాతో నడిచే బీజేపీకి ఈ పాయింట్ బాగా నచ్చింది.  అందుకే నిత్యం తిరుమల విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నారు.  తిరుమల డిక్లరేషన్, శ్రీవారి ఆస్తుల వేలం, శ్రీవారి పేరిట బ్యాంకుల్లో వేల కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లతో రాష్ట్ర ప్రభుత్వ బాండ్లను కొనాలని పాలకమండలి అనుకోవడం లాంటి అంశాలను రాద్ధాంతం చేశారు.  క్రైస్తవ మతానికి చెందిన సీఎం హిందూత్వాన్ని దెబ్బతీస్తున్నారని, తిరుమల పవిత్రతను కాపాడట్లేదని గగ్గోలు పెడుతున్నారు.  మొదట్లో బీజేపీ, టీడీపీ మాటలను పెద్దగా పట్టించుకోని జనం మెల్లగా నిజమే కదా అనే ధోరణిలోకి వెళ్తున్నారు.  తిరుమల కొండా మీద రాజకీయాలు, ఆధిపత్య ధోరణిలు ఏమిటని అడుగుతున్నారు.  
 
దీంతో బీజేపీ మరింత రేగిపోవడం స్టార్ట్ చేసింది.  తిరుపతి ఉప ఎన్నికల్లో దీన్నే ఆయుధంగా చేసుకోవాలని అనుకుంటోంది.  ఏ నేపథ్యంలో మరోసారి వైసీపీ నేతలు బీజేపీ చేతికి చిక్కారు.  నిన్న డిసెంబర్ 25న వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ రెండూ వచ్చాయి.  వైకుంఠ ఏకాదశి కావడంతో వైసీపీ ప్రముఖ నేతలు చాలామంది తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు.  బయటికొచ్చి మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశితో పాటు ముఖ్యమంత్రి జగన్ కు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు.  ఇలా చెప్పడంలో ముఖ్యమంత్రి మనసు దోచుకోవాలనే ఆలోచన తప్ప వేరే ఇంటెంక్షన్ లేదు వైసీపీ నేతల్లో.  కొండ మీద నిలబడి   శుభాకాంక్షలు చెప్పినంత మాత్రాన తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లుతుందంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు.  మన మతం, పర మతం అనే తేడాలు మనుషులకే తప్ప దేవుడికి ఉంటాయా.  కానీ బీజేపీ నేతలు ఉంటాయన్నట్టే మాట్లాడుతున్నారు. 
 
క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పి తిరుమల పవిత్రతను దెబ్బతీశారని ప్రచారం మొదలుపెట్టారు.  ఆ విషెస్ ఏదో కొండా దిగి చెప్పుకోవచ్చు కదా అంటూ మాట్లాడారు.  దేవుడు అనే భావోద్వేగంలో ఈ మాటలు జనానికి ఎక్కినా ఎక్కేస్తాయి.  ఈ ఇబ్బందులన్నీ పడే బదులు తిరుమల వెళ్ళినప్పుడు వైసీపీ నేతలే కాస్త తగ్గి మాట పరమైన విమర్శలకు తావివ్వకుండా ఉండటం మంచిది.  

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News