ఒకప్పుడు రాజకీయాల్లో రాణించడం చాలా సులువు. మంచి పనులు చేస్తే చాలు రాజకీయాల్లో ఎదిగిపోవచ్చు. అయితే ఇప్పుడున్న రోజుల్లో రాజకీయాల్లో ఎదగాలంటే మంచిపనులు చేస్తే సరిపోదు, అంతకు మించి వ్యూహాలు పన్నే తెలివితేటలు ఉండాలి. ఏపీలో రాజకీయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలివితేటల విషయంలో ఆయనను కొట్టేవారే లేరు. ఆయనకు ఉన్న జ్ఞాపకశక్తి గురించి ప్రతిపక్ష నాయకులు కూడా సందర్భాన్ని బట్టి పొగిడేవారు. అయితే ఇప్పుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా రాజకీయాల్లో తన తెలివితేటలు చూపిస్తూ ప్రజల చేత శభాష్ అనిపించుకుంటున్నారు. అలాగే ఆయనకు ఉన్న జ్ఞాపకశక్తి గురించి వైసీపీ నేతలు కూడా పొగుడుతున్నారు.
గతంలో చంద్రబాబు నాయుడు చెప్పే విషయాలను రాసుకోవడానికి అప్పటి మంత్రులు నోట్ బుక్స్ పట్టుకొని తిరిగేవారు. బాబు అన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ అడిగేవారు. అలాగే ఆయన గతంలో పేపర్ లెస్ క్యాబినెట్ కోసం కూడా కృషి చేశారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కూడా జ్ఞాపకశక్తి విషయంలో బాబును మించిపోతున్నారు . ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఓ విషయాన్ని సీఎం జగన్ ప్రస్తావించారని, ఆయన జ్ఞాపక శక్తిని చూసి మేమంతా ఆశ్చర్య పోయామని మంత్రి పేర్ని నాని చెప్పిన విషయం తెలిసిందే. ఆయనేకాదు.. ఈ విషయాన్ని మరోమంత్రి కన్నబాబు కూడా చెప్పుకొచ్చారు.
కృష్ణానది నీటిని ఒడిసి పట్టే విషయంలో ఎన్నికలకు ముందు ప్రజాసంకల్ప యాత్రలో జిల్లా రైతులకు జగన్ హామీ ఇచ్చారు. ఫస్ట్ కేబినెట్లోనే జగన్ ఈ విషయంపై మాట్లాడారు. కృష్ణానదిపై అవనిగడ్డ దగ్గర, మరో చోట.. రెండు ప్రాజెక్టులు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధ చేయాలని,ఎంత ఖర్చయినా వెనుకాడవద్దని కూడా సీఎం జగన్ మంత్రి పేర్నినానిని ఆదేశించారు. ఇలా జగన్ కు తాను ఇచ్చిన హామీలను,చేసిన పనులను అన్నింటిని గుర్తుపెట్టుకుంటు పార్టీ నాయకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.