టీడీపీ ఎమ్మెల్యేలు వస్తుంటే వైసీపీ నేతలు వణుకుతున్నారట ?

ఎన్నికల్లో గెలిచి పదవి చేపడితే ఏ పార్టీలో అయినా విలువ ఉంటుంది.   అందుకే ఎన్నికల తర్వాత పార్టీ మార్పిడి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. 2019 ఎన్నికల తర్వాత ఏపీలో జరుగుతున్నది అదే.  టీడీపీ దారుణంగా ఓడిపోవడంతో టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు కొందరు అధికార పార్టీ వైపు కన్నేశారు.  కానీ మొదట్లో జగన్ పదవికి రాజీనామా చేశాకే పార్టీలోకి రావాలని కండిషన్ పెట్టడంతో వెనక్కు తగ్గారు.  కానీ మెల్లగా జగన్ షరతులు సడలాయి.  అధికారికంగా టీడీపీలోనే ఉన్నా మెలగాల్సింది మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలుగా అన్నట్టు ఒప్పందం కుదిరిందో ఏమో కానీ టీడీపీ ఎమ్మెల్యేలై ముగురు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి ఒకరివెంట ఒకరు వైసీపీతో కలిసిపోయారు. 

YSRCP leaders facing troubles with TDP MLA’s

అదే బాటలో టీడీపీని వీడిన మరొక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్.  విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే అయిన గణేష్ రెండు రోజుల క్రితమే వైసీపీకి అనుకూలమైపోయారు.  ఇలా ఎమ్మెల్యేలు పోతుంటే టీడీపీ బాధపడటం మామూలు విషయమే.  కానీ చిత్రంగా   వైసీపీ నేతలు దిగులుపడుతున్నాఋ.  అదేమిటి ఎమ్మెల్యేల సంఖ్యా పెరిగే ఆనందపడాలి కానీ ఇలా దిగులు పడటం ఎందుకని అనుకుంటున్నారా.. దానికి పెద్ద కారణమే ఉంది.  వైసీపీ లోకి వస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు వచ్చీ రావడమే అంతా తమదే, మొత్తం తామే అన్నట్టు వ్యవహరిస్తున్నారు,  పాత వైసీపీ నాయకులను వెనక్కు నెట్టేస్తున్నారు.  ఫలితంగా గ్రూపు రాజకీయాలు  మొదలయ్యాయి.  అధిష్టానం కూడా కొత్తగా వచ్ఛే టీడీపీఎమ్మెల్యేలను నిలువరించే ప్రయత్నమేమీ చెయ్యట్లేదు. 


పైగా ఓడిన తమ అభ్యర్థులను పక్కన పెట్టేస్తున్నారు.  ఇప్పటివరకు ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీలోకి రాగా ఆ మూడు నియోజకవర్గాల్లో ఓడిన వైసీపీ లీడర్లకు విలువలేకుండా పోయిందట.  నేరుగా అధిష్టానమే వారికి ఏదో ఒక  పదవి ఇచ్చి సైలెంట్ చేస్తోందట.  తాజాగా విశాఖ సౌత్ నియోజకవర్గంలో వైసీపీ నేత ద్రోణంరాజు పరిస్థితి ఇదేనట.  దీంతో వారంతా ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసినా చివరకు దక్కిన గౌరవం ఇదా.  ఇన్నేళ్లు శత్రువులుగా ఉన్న వారు ఈ ఒక్కరోజులో మిత్రులైపోయారా, వారి కోసం మమ్మల్ని పక్కనపెడతారా అంటూ వాపోతున్నారట.  ఈ పరిణామాలన్నీ చూసిన మిగతా నియోజకవర్గాల్లో ఒదిన వైసీపీ అభ్యర్థులు ఎక్కడ టీడీపీఎమ్మెల్యేలు వఛ్చి చేరతారో, తమకు ఎసరు పెడతారోనని కంగారుపడుతున్నారట.