వైసీపీలో అతితక్కువ కాలంలో ఎక్కువ పాపులర్ అయిన నాయకుల్లో గుంటూరు జిల్లాలోని చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజని ఒకరు. నిత్యం ఆమె చుట్టూ ఎదో ఒక వివాదం జరుగుతూనే ఉంటుంది. 2019 ఎన్నికల సమయంలో మొదట ఆమె టీడీపీలో చేరడానికి ప్రయత్నించారు. అయితే అక్కడ సీట్ సర్దుబాటు కాకపోవడం వల్ల ఆమె వైసీపీలో చేరారు. అయితే ఆమెకు వైసీపీలో చాలా సులభంగా సీట్ దక్కించుకున్నారు. చిలకలూరి పేటలో వైసీపీకి ఉన్న ప్రధాన నాయకుడైన మర్రి రాజశేఖర్ ను కూడా కాదని రజనికి సీట్ ఇచ్చారు. ఇలా వైసీపీలో సీనియర్ నాయకులకు కూడా చేతకాని చాలా పనులను రజని చాలా సులభంగా చేస్తున్నారు.
వైసీపీ నాయకులతోనే గొడవలు
విడదల రజని గోడవలన్ని దాదాపు వైసీపీ నాయకులతోనే. నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతోనూ విడదల ఢీ అంటే ఢీ అంటున్నారు. ఆయనపై పైచేయి సాధించేందుకు ఉన్న ప్రతి అవకాశాన్నీ విడదల రజనీ సద్వినియోగం చేసుకుంటున్నారు. కోటప్పకొండ తిరునాళ్లే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఎంపీ కారును సైతం ఎమ్మెల్యే అనుచరులు, కుటుంబ సభ్యులే నిలువరించి దాడులు చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇప్పటి వరకు చర్యలు లేవు. అయితే తన ఫోన్ ను ట్యాప్ చెయ్యడానికి ఎంపీ లావు కృష్ణదేవరాయల ప్రయత్నించారని రజని ఫిర్యాదు చేసిన వెంటనే ఇద్దరు పోలీసు అధికారులను వైసీపీ ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే వైసీపీ కీలక నేతలకు కూడా సాధ్యం కానీ పనులను రజని ఎలా చేస్తున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు.
రజని వెనక ఉన్న రాజకీయ శక్తి ఎవరు?
విడదల రజనికి చివరి నిమిషంలో సీట్ రావడం వెనక, ఆమెకు చుట్టూ ఎన్నియు వివాదాలు ఉన్న కూడా ఆమె వాటి నుండి సులువుగా బయటపడటానికి, సొంత పార్టీ నేతలకే ఎదురుతిరిగి ధైర్యంగా నిలవడానికి ఆమె వెనక ఎదో ఒక రాజకీయ శక్తి ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆ రాజకీయ శక్తి వైసీపీలోని కీలక నాయకుడైన సజ్జల రామకృష్ణ రెడ్డి ఉన్నారని నియోజక వర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన అండ చూసుకొని రజని దూకుడుగా వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. సజ్జల అండతో రజని చేస్తున్న రాజకీయాలకు సొంత వైసీపీ నేతలే భయపడుతున్నారని టాక్ వినిపిస్తుంది. సజ్జల ఉన్నాడన్న ధీమాతోనే ఆమె మంత్రి పదవికి కూడా ప్రయత్నిస్తున్నారని సమాచారం. మరి రానున్న రోజుల్లో రజని మంత్రి అవుతారో లేదో వేచి చూడాలి.