2019 ఎన్నికల్లో ఎలాగైన గెలవాలని నిర్ణయం తీసుకున్న జగన్ మోహన్ రెడ్డి ఏమైనా చేయడానికి వెనకాడలేదు. తన గెలుపుకు గోరంత ఉపయోగపడుతాడని అనిపించినా జగన్ అతన్ని వదలలేదు. ఇలా తన గెలుపు కోసం కొన్ని వందల మంది నాయకులను పార్టీలోకి తీసుకున్నాడు. పార్టీలోకి వచ్చిన ప్రతి నాయకుడు వైసీపీ గెలిచిన తరువాత తమకు జగన్ ఎదో ఒక పదవి ఇస్తాడాని ఆశించారు. ఇందులో కొంతమంది సక్సెస్ అయ్యారు. మరికొంత మంది నాయకులు నిరాశ పడ్డారు. ఈ నిరాశ పడ్డ నాయకుల్లో చాలా పెద్ద నాయకులు కూడా ఉన్నారు. అదే టైంలో మండలి రద్దు విషయంలో జగన్ బలమైన నిర్ణయంతో ఉండడంతో చాలా మంది ఆందోళనలో ఉన్నారు. తమకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందా ? లేదా ? అన్న తర్జన భర్జనలు పడుతున్నారు. ఇక పార్టీ తరపున రెండు నుంచి నాలుగైదు సార్లు గెలిచిన సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఎలాంటి పదవులు లేకుండా ఆశ నిరాశల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ లిస్టులో రాయలసీమకు చెందిన 20 మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారంటే అక్కడ పదవుల కోసం పోటీ ఎలా ఉందో అర్థమవుతోంది.
వీళ్ళందరికి గురించి పక్కన పెడితే వైసీపీ నుండి గెలిచిన ఒక ఎమ్మెల్యే కూడా జగన్ మోహన్ రెడ్డి తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదినేత ఎవరంటే ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఓడించిన భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్. శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ ను ఓడించిన తరువాత జగన్ తన కష్టాన్ని గుర్తించి తనకు మంత్రి పదవి ఇస్తాడని భావించాడు. అయితే చివరికి నిరాశే మిగిలింది. కనీసం నామినేటెడ్ పదవి కూడా ఇవ్వడం లేదు. మంత్రి పదవి ఇచ్చే వరకు నామినేటెడ్ పదవి కోసం పార్టీ అధిష్టానాన్ని కలవడానికి ప్రయత్నిస్తున్నా అపాయింట్ మెంట్ దొరకడం లేదని తెలుస్తుంది. వచ్చే సంవత్సరం కూడా శ్రీనివాస్ కు మంత్రి పదవి రావడం కష్టమని, ఆల్రెడీ ఆ రేసులో నరసాపురం నుంచి మరో సీనియర్ నేత ముదునూరి ప్రసాదరాజు ఉన్నారని, పార్టీ ఆయనే పట్టం కట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.