ప్రజా వ్యతిరేకతతో వైసీపీ శ్రేణులు షాక్.!

YSRCP In Shock : 151 కంటే ఈసారి ఎక్కువ సీట్లు కొడతామంటోంది వైసీపీ. ఏంటీ, గడప గడపకీ వైఎస్సార్ కాంగ్రెష్ పార్టీ.. అనే నినాదం పట్ల జనం విసిగి వేసారిపోతున్నా కూడానా.? అని అంతా విస్తుపోతున్నా, వైసీపీ కామెడీ మాత్రం ఆగడంలేదు. ఏ పార్టీ అయినా, మొత్తం స్థానాల్లో గెలుపొందాలని అనుకోవడంలో తప్పు లేదు.

కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ గ్రౌండ్ రియాల్టీ తెలియకుండా మాట్లాడితే ఎలా.? తమ మూడేళ్ళ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చాం.? అన్నదాన్ని అధికార పార్టీ బేరీజు వేసుకోవద్దూ.? సంక్షేమ పథకాలొక్కటే తమను అధికార పీఠమెక్కించేస్తాయనుకుంటే పొరపాటు.

రాజధాని, ఉద్యోగుల సీపీఎస్ రద్దు, పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కడప స్టీలు ప్లాంటు, దుగరాజపట్నం పోర్టు, వీటితోపాటుగా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకోండి, విశాఖ రైల్వే జోన్ సాధించడం.. ఇలాంటి అత్యంత కీలకమైన అంశాలున్నాయ్.

వైఎస్ జగన్ హయాంలో కొత్తగా ప్రారంభించి పూర్తి చేసిన ప్రాజెక్టు గడచిన మూడేళ్ళలో చిన్నదైనా కూడా లేదు. మరెలా, జనాన్ని ఓట్లడిగేది.? పెరిగిన ధరలు సహా, వివిధ సమస్యలపై జనం అధికార పార్టీ ప్రజా ప్రతినిథుల్ని నిలదీస్తున్నారు. గడప గడపకూ వెళ్ళాల్సిన వైసీపీ నేతలు, జనానికి కాస్త దూరంగా పార్టీ కార్యకర్తలతో చిన్న చిన్న సభలు పెట్టేసి మమ అనిపించేస్తున్నారంటేనే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది.