రాజధాని తరలింపుకు వైసీపీ ప్రభుత్వం కొత్త ముహూర్తాన్ని ఖరారు చేసిందా!! కోర్ట్ చిక్కులు విడనున్నాయా!!

ap cm ys jagan delhi tour

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్ర రాజకీయాలు మొత్తం రాజధాని చుట్టూనే తిరుగుతున్నాయి. 2019లో మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించినప్పటి నుండి ఇప్పటి వరకు ఆ అంశం చుట్టూనే రాజకీయాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు జగన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించి సంవత్సరం గడిచిపోయింది. దీంతో విశాఖ ప్రజలకు కూడా రాజధాని వస్తుందో లేదో అణా అనుమానం మొదలయింది. అయితే రాజధాని తరలింపు ఖాయమని వైసీపీ నాయకులు చెప్తున్నారు.

కొత్త ముహూర్తం ఖరారు చేసిన వైసీపీ

ఉగాదికి విశాఖ రాజధానికి మధ్య అనుబంధం ఉన్నట్లుంది. అందుకే మరో ఉగాది వేళ రాజధాని తరలింపునకు ముడి పెట్టి వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. 2020 మార్చి 25న ఉగాది వేళ విశాఖకు రాజధాని షిఫ్ట్ చేయాలని జగన్ సర్కార్ భావించింది. అయితే అనుకోని ఉపద్రవంగా కరోనా వైరస్ వచ్చిపడింది. ఆ మీదట అసెంబ్లీలో మూడు రాజధానులు తీర్మానం అయి చట్టంగా చేసినా కూడా కోర్టు వివాదాలతో పుణ్యకాలం గడచిపోయింది. దాంతో ఈ ఏడాది ఏప్రిల్ 13వ తేదీన‌ ఉగాది శుభవేళను ఇపుడు సరికొత్త ముహూర్తంగా ముందుకు తెస్తున్నారు.

కోర్ట్ చిక్కులు వీడేనా!!

ఇక రాజధాని విషయంలో కోర్టులో న్యాయపరమైన చిక్కులు ఉన్న సంగతి తెలిసిందే. మూడు రాజధానుల విషయమో హై కోర్టు విచారణ జరుపుతోంది. ఇదిలా ఉంటే హై కోర్టు చీఫ్ జస్టిస్ బదిలీ అయి వెళ్ళడంతో కొత్త సీజే వస్తున్నారు. ఆయన వచ్చిన తరువాత ఈ కేసు విచారణ మళ్లీ జరుగుతుంది అంటున్నారు. ఎలా చూసుకున్నా మరో మూడు నెలల సమయం పడుతుంది అని చెబుతున్నారు. అందుకే ఉగాది టైం ని వైసీపీ సర్కార్ ముహూర్తంగా రెడీ చేసి పెట్టుకుందని అంటున్నారు. అప్పటికి తీర్పు వస్తుందని కూడా అంచనా వేస్తున్నారు.