YS Vijayamma: వైసీపీలో కీలక పదవి అందుకోబోతున్న వైయస్ విజయమ్మ…. అసలు ఏం జరుగుతుంది?

YS Vijayamma: వైసీపీ పార్టీ 2024 ఎన్నికలలో ఘరంగా ఓడిపోయిన తర్వాత ఈ పార్టీలో ఎన్నో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎంతో మంది కీలక నేతలు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. అలాగే జగన్మోహన్ రెడ్డి తిరిగి తన పార్టీని ఏపీలో నిలబెట్టుకోవడం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది కీలక నేతలు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళగా మరికొందరు రాజకీయాలకు కూడా దూరమవుతున్నారు.

ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఒంటరి అవుతున్నారు అనుకుంటున్న నేపథ్యంలో ఈయన బెంగుళూరు ప్యాలెస్ వేదికగా సరికొత్త వ్యూహాలను రక్షిస్తున్నారని తెలుస్తుంది ఈ క్రమంలోనే తన తండ్రి హయాంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా ఉన్నటువంటి కొంతమందిని తిరిగి వైసీపీ పార్టీలోకి ఆహ్వానించబోతున్నారని తెలుస్తుంది ఇప్పటికే సాకే శైలజనాథ్ వైకాపాతీర్థం పుచ్చుకున్నారు.

ఇకపోతే 2019 ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డితో పాటు తన తల్లి విజయమ్మ చెల్లెలు షర్మిల కూడా ఉన్నారు వీరిద్దరూ జగన్మోహన్ రెడ్డి గెలుపుకు ఎంతగానో దోహదం చేశారు. కొన్ని అభిప్రాయ భేదాలు కారణంగా తన తల్లి చెల్లి పార్టీ నుంచి బయటకు రావడంతో 2024లో జగన్ ఓటమికి కూడా పెద్ద డ్యామేజ్ అవుతుంది.

ఇక వైసిపి పార్టీ ఆవిర్భావమైనప్పటికి కూడా ఈ పార్టీ గౌరవాధక్షురాలుగా విజయమ్మ బాధ్యతలు తీసుకున్నారా అయితే షర్మిలా తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత ఈమె తన పదవికి రాజీనామా చేసి వెళ్లారు. అయితే త్వరలోనే తిరిగి ఈమె వైసీపీలో కీలక పదవి అందుకోబోతున్నారని తెలుస్తోంది. ఇటీవల జగన్ తన కుటుంబంతో కలిసి లండన్ వెళ్లారు అయితే ఈ లండన్ పర్యటనలో విజయమ్మ కూడా ఉన్నారని తెలుస్తుంది.

ఇలా తన కొడుకుకు సపోర్టుగా మరోసారి విజయమ్మ వైకాపాలోకి రాబోతున్నారని తెలుస్తోంది అదేవిధంగా షర్మిల కూడా వైసీపీలోకి వస్తుందని సంకేతాలు కూడా వినపడుతున్నాయి మరి అంతర్గతంగా వైకాపాలో ఏం జరుగుతుంది? ఏంటి అనే విషయాలు తెలియాల్సింది.