Y.S.Sharmila: ఏపీ ఉచిత బస్సు ప్రయాణం పై యూటర్న్ తీసుకున్న కూటమి…. ఫైర్ అయిన షర్మిల!

Y.S.Sharmila: ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు పెద్ద ఎత్తున సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు తెలియజేస్తూ ప్రజలను ఆకర్షించారనే సంగతి మనకు తెలిసిందే. ఇలా సూపర్ సిక్స్ హామీలలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే హామీను కూడా ప్రకటించారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు తొమ్మిది నెలల కాలం పూర్తి అవుతున్న ఇప్పటివరకు ఈ పథకం గురించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఈ క్రమంలోనే తరచూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు అంటూ కూటమిని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఉచిత బస్సు ప్రయాణం గురించి కూటమి ప్రభుత్వ కీలక అప్డేట్ వెల్లడించారు. ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రవ్యాప్తంగా వర్తించదని కేవలం జిల్లాలకు మాత్రమే వర్తిస్తుంది అంటూ కూటమి నేతలు చెప్పడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారితే.

ఇలా ఉచిత బస్సు విషయంలో ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడంతో ఈ విషయం పై వైసీపీ నేతలు విమర్శలు కురిపించారు మరోవైపు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఘాటుగా స్పందించారు.ఏరు దాటేంత వరకు ఓడ మల్లన్నా, దాటాక బోడి మల్లన్నలా కూటమి ప్రభుత్వ తీరు ఉందని షర్మిల విమర్శించారు. ఎన్నికలకు ముందు మహిళలకు బస్సు ఫ్రీ ఫ్రీ అంటూ ఊదరగొట్టి ప్రజల చేత ఓట్లు వేయించుకొని ఇప్పుడు కండిషన్స్ అప్లై అంటే సరిపోదని తెలిపారు.

జిల్లా స్థాయి వరకే పథకాన్ని పరిమితం చేస్తామని చెప్పడం మోసమే అన్నారు. చేయాలన్న చిత్తశుద్ది లేక చెప్పే సాకులు అని షర్మిల మండిపడ్డారు. ఆదిలోనే యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటు అయ్యే తొమ్మిది నెలలు అవుతున్న కాలయాపన చేస్తూ పర్యటనల పేరుతో కూటమినేతల విహారయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఇక ఈ పథకం అమలు కాకముందే జిల్లాల వరకు మాత్రమే పరిమితం చెబుతున్నారు ఇక అమలు అయిన తర్వాత నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం అనే కండిషన్లు కూడా పెడతారేమో అంటూ షర్మిల కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు.