Y.S.Sharmila: వైయస్ భారతి రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలి… డిమాండ్ చేసిన వైఎస్ షర్మిల!

Y.S Sharmila: సాక్షి మీడియాలో ఇటీవల ప్రముఖ సీనియర్ జర్నలిస్టు కుమ్మినేని శ్రీనివాస్ రావు ఒక డిబేట్ నిర్వహించారు. ఈ డిబేట్లో భాగంగా అమరావతి మహిళలను వేశ్యలు అంటూ మాట్లాడిన మాటలు తీవ్రస్థాయిలో సంచలనాలకు కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా సాక్షి మీడియాపై దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై షర్మిల కూడా స్పందించారు.

చిత్తూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ సాక్షి టీవీ ఛైర్‌పర్సన్, జగన్ సతీమణి భారతీరెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సాక్షి న్యూస్ డిబేట్లో అమరావతి మహిళలను కించపరుస్తూ మాట్లాడటం అవమానకరమన్నారు. అమరావతి మహిళలను కించ పరచటం పై మాజీ సీఎం జగన్ క్షమాపణలు చెబితే మరింత సంతోషిస్తామని షర్మిల తెలియజేశారు. సాక్షి ఛానల్ అమరావతి గురించి మహిళల గురించి కాకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెడితే బాగుంటుందని సలహాలు ఇచ్చారు.

ప్రజా సమస్యలు పట్టించుకోని మీడియా సంస్థగా సాక్షి చరిత్రకెక్కిందని షర్మిల విమర్శించారు. ఇలా వైయస్ భారతి రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి గురించి వైయస్ షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో సంచలనంగా మారాయి. ఇకపోతే వైయస్ షర్మిల ఇటీవల కాలంలో వైయస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు కురిపిస్తున్నారు. ఏమాత్రం సమయం సందర్భం దొరికిన తన అన్నయ్య జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేయడంతో షర్మిల కూడా విమర్శలు పాలవుతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు విమర్శలు చేసిన అర్థం ఉంటుంది కానీ ఇప్పుడు ఆయన ఓటమి పాలై, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా షర్మిల తరచూ జగన్మహన్ రెడ్డిని ప్రశ్నించే విధానం అందరిని విస్మయానికి గురిచేస్తుంది.