Y.S. Sharmila: సింగయ్య మృతి… అన్నకు అదిరిపోయే సలహా ఇచ్చిన షర్మిల?

Y.S Sharmila: ఇటీవల జగన్ మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో అపశృతి చోటుచేసుకుని సింగయ్య అనే కార్యకర్త మరణించిన విషయం తెలిసిందే. ఇలా సింగయ్య అనే వ్యక్తి మరణించడంతో ఆ తప్పు జగన్మోహన్ రెడ్డిదే అంటూ కూటమి నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అదేవిధంగా ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల కూడా ఈ ఘటనపై స్పందిస్తూ వైయస్ జగన్మోహన్ రెడ్డినీ తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగానే సింగయ్య అనే వ్యక్తి మరణించారని ఇది ముమ్మాటికీ నిజమని తెలిపారు.

సింగయ్య స్వయంగా జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి నలిగి చనిపోయిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డికి మానవత్వం లేదని ఆయనకున్న నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి సంఘటన చోటుచేసుకుందని తెలిపారు. నిజానికి జగన్ మోహన్ రెడ్డికి మానవత్వమే ఉంటే ఈపాటికి సింగయ్య కుటుంబాన్ని పరామర్శించి తనకు ఒక ఐదో లేదా పది కోట్లు ఇచ్చి క్షమాపణలు చెప్పేవారని తెలిపారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సింగయ్య కుటుంబానికి పరిహారం చెల్లించి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలుగా కుంభకర్ణుడులా నిద్ర నిద్రపోతూ ఇప్పుడు ప్రజా సమస్యలు అంటూ బయటకు రావడం చాలా విడ్డూరంగా ఉందని తెలిపారు. జగన్ వి బలప్రదర్శన, జన సమీకరణ కార్యక్రమాలు తప్పా ప్రజల కోసం కాదని స్పష్టం చేశారు. డబ్బుంది, బలం ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ జన సమీకరణ సభలకు అనుమతి ఇవ్వకండి..జనాలను చంపకండి అని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. కారులో ఉన్న అందరినీ విచారణకు పిలవాలని డిమాండ్ చేశారు. ఇలా సింగయ్య మృతిపై జగన్మోహన్ రెడ్డిని తప్పుపడుతూ షర్మిల చేసినా ఈ వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి.