Y.S.Sharmila: షర్మిలకు షాక్ ఇవ్వబోతున్న ఢిల్లీ పెద్దలు… పీసీసీ అధ్యక్షురాలిగా ఆమెకు పట్టం?

Y.S.Sharmila: వైయస్ మరణం తర్వాత వైయస్ జగన్మోహన్ రెడ్డి షర్మిల ఇద్దరు ఏకమై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని విజయవంతంగా ముందుకు నడిపించారు. ఇక 2019 ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి షర్మిల కూడా కీలక పాత్ర పోషించారు. ఇక జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిలతో పలు భేదాభిప్రాయాలు రావడంతో షర్మిల తెలంగాణలో వైయస్సార్ టిపి అనే పార్టీని ఏర్పాటుచేసి కొద్ది నెలలకి ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు అనంతరం ఈమె ఆంధ్ర రాజకీయాల వైపు వచ్చారు.

ఇక ఏపీలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇలా షర్మిల పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తన అన్నయ్య జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఇలా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడంతో కాంగ్రెస్ పార్టీకి కాస్త హైప్ వచ్చింది అయితే ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఈమె ప్రచారాలు చేయడంతో ఇది కాస్త కూటమికి అనుకూలంగా మారడం కూటమి భారీ మెజారిటీతో గెలవడానికి ఉపయోగపడింది.

ఇలా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిల జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడటంతో కాంగ్రెస్ పార్టీపై ఉన్నటువంటి నమ్మకం తగ్గిపోవడమే కాకుండా ఆ పార్టీ గ్రాఫ్ ఏ మాత్రం పెరగలేదు దీంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఈ విషయాన్ని ఢిల్లీ పెద్దలకు చేరవేయడంతో పీసీసీ పదవి విషయంలో ఢిల్లీ పెద్దలు కూడా సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. షర్మిలకు ఈ బాధ్యతలు అప్ప చెబితే భవిష్యత్తులో తమ పార్టీకిఏ మాత్రం లాభం ఉండదని గ్రహించిన ఢిల్లీ పెద్దలు వెంటనే ఆమెను ఈ పదవి నుంచి తప్పించి కిల్లి కృపారానికి ఈ బాధ్యతలు అప్పగించారని భావిస్తున్నట్టు తెలుస్తుంది. అదే కనుక జరిగితే షర్మిల మాజీ అవుతారని అంటున్నారు. ఈ ప్రచారంలో నిజమెంత ఉందో చూడాల్సిందే.