Ys Sharmila : ఏపీ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల.! కండిషన్స్ అప్లయ్.!

Ys Sharmila :  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ‘నేనెవరో వదిలిన బాణాన్ని కాదు..’ అని ఇన్నాళ్ళూ చెబుతూ వస్తున్న వైఎస్ షర్మిల, తాను అన్న వైఎస్ జగన్ వదిలిన బాణాన్నేనని ప్రకటించబోతున్నారట. అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి షర్మిల మాట్లాడతారనీ, వైఎస్ జగన్‌కి అనుకూలంగా ఆమె స్టేట్‌మెంట్ ఇవ్వబోతున్నారనీ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అదేంటీ, అన్న మీద కోపంతో వైసీపీని కాదనుకుని వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసుకున్న వైఎస్ షర్మిల, మళ్ళీ ఇప్పుడు అన్న పంచన చేరడమేంటి.? అంటే, తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల రాణించాలంటే, అధికారికంగా అన్నా చెల్లెళ్ళ మధ్య ఎలాంటి విభేదాలూ లేవని తేలాలి. అదే సమయంలో, వైసీపీకి ఆంధ్రప్రదేశ్‌లో ఇబ్బందులు వుండకూడదన్నా షర్మిల, వైఎస్ జగన్ కలవాలి.

మొత్తమ్మీద, ఒకరి అవసరం ఇంకొకరికి ఏర్పడింది. దాంతో, ఇద్దరూ ఒక్కటవక తప్పేలా లేదు. ఏపీలో రాజకీయ పరిస్థితులపై వైఎస్ షర్మిల భర్త అనిల్ కొన్నాళ్ళపాటు రీసెర్చ్ చేశారు. కొత్త పార్టీ ఆలోచన చేస్తున్నట్లుగా లీకులు ఇచ్చిన అనిల్, వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకున్నారు.

అదే సమయంలో, తెలంగాణలోనూ అనిల్ టీమ్ గ్రౌండ్ రియాల్టీ తెలుసుకుందట. ఈ నేపథ్యంలో ఉభయులకూ మేలు జరగాలంటే షర్మిల, జగన్ కలవక తప్పదనే నిర్ణయానికి వచ్చారట. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ కూడా, షర్మిలతో కలిసి ‘వేదిక’ పంచుకోవడానికి సిద్ధమయ్యారనే అంటున్నారు.

ఇదిలా వుంటే, షర్మిల గట్టిగానే తెలంగాణ రాష్ట్ర సమితిని విమర్శిస్తున్నా.. ఆ పార్టీతో కలిసి పని చేసే అవకాశం వుందని సమాచారం.