కేసీఆర్ పాలనను ఆ విధంగా పోల్చిన వైయస్ షర్మిల..

ఆంధ్ర ప్రదేశ్ వైయస్సార్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాలనకు, వైయస్సార్ పాలనకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని విమర్శలు చేశారు. వైయస్ఆర్ పాలనలో ఆర్టీసీ చార్జీలు, కరెంటు చార్జీలు పెంచలేదని.. ఒకవేళ కేంద్రం గ్యాస్ రేట్లు పెంచిన కూడా తానే భరించారు అని తెలిపారు.

ఇక వైయస్సార్ రాజీవ్ స్వగృహ ద్వారా ఇళ్లు కట్టిస్తే.. కేసీఆర్ మాత్రం వాటిని అమ్మకానికి పెట్టారు అని అన్నారు. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందిస్తే.. నేడు అవన్నీ కేటాయించకుండా ఆ పథకాన్ని ఎత్తేసే ప్లాన్ లో కేసీఆర్ ఉన్నారని అన్నారు. ఇక విద్యార్థులకు కనీసం స్కాలర్షిప్ లకు కూడా నిధులు ఇవ్వడం లేదు అని అన్నారు.