విష ప్రచారానికి బ్రేకులు వేసిన జగన్.. విశాఖవాసుల్లో కొత్త ఆశలు నింపాడా.. ??

jagan telugu rajyam

 

ఏపీ రాజకీయాల్లో అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి మధ్య జరుగుతున్న పోరు ఈనాటిది కాదన్న విషయం తెలిసిందే.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ కుటుంబానికి ఎన్ని అవమానాలు పరిచయం చేసారో ప్రతి మనసుకు తెలుసు.. ఆ అవమానాలను ఒక్కొక్కటిగా తన విజయానికి పునాదులుగా వేసుకున్న వైఎస్ జగన్ నేడు సీయంగా అధికారంలో ఉండి టీడీపీ అవినీతి గొలుసులను ఒక్కొక్కటిగా బయటకు కనబడేలా చేస్తున్నారన్నది ఏపీ ప్రజల మనోగతమట.. ఇలా తమ అక్రమాల చిట్టాను బయటకు విప్పుతున్న అధికార పార్టీ మీద నిందవేయడానికి టీడీపీ వాడుతున్న పదం కక్ష సాధింపు.. నిజానికి ఏపీ రాష్ట్ర అభివృద్ధికి సహకరించుకోవలసిన వారు పదవుల కోసం పాకులాడటం ప్రజలు చేసుకున్న దురదృష్టమా అని ఆలోచించే వారు లేకపోలేదు..

అమరావతి రాజధాని అని గ్రాఫిక్‌లో చూపించిన చంద్రన్న టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత దాని సంగతే మరిచారు.. ఇక అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ విశాఖను పాలనా రాజధానిని చేస్తూ చట్టం చేసింది. ఈ నేపధ్యంలో రాజధానికి భూములిచ్చిన రైతులు మాత్రం అనాధలుగా మిగిలిపోయారు.. దాంతో రాజధాని అమరావతి, విశాఖ అనే విషయం ఎటూ తేలక పెండింగ్ పడిపోయింది. ఇది చాలదన్నట్లుగా ఇపుడు కోర్టులో అమరావతి రాజధాని మీద విచారణ సాగుతోంది. ఈ క్రమంలో విశాఖకు రాజధాని ఎప్పుడు తరలివస్తుంది అన్నది చర్చగానే మిగిలిపోయింది.. ఈ విషయంలో ఏపీలో వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.. కాగా ఈ సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ రాజధానిని కోరుకునే వారిలో కొత్త జోష్ ని కలిగిస్తున్నాయట.

విజయవాడ కనకదుర్గమ్మ వారి ఫ్లై ఓవర్ వంతెన ప్రారంభం సందర్భంగా వైఎస్ జగన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో మాట్లాడుతూ విశాఖ రాజధాని ప్రస్తావన మరోమారు తీసుకువచ్చారట. ఇందులో భాగంగా విశాఖ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకూ అయిదు లైన్ల రహదారిని నిర్మాణం చేయమంటూ కోరాడట వైఎస్ జగన్.. ఇక విశాఖ రాజధాని నగరానికి ఈ రహదారులు చాలా అవసరమని తెలియడానికే ఈ ప్రస్తావన తెచ్చారట..

మొత్తానికి టీడీపీ తమ్ముళ్ళు విశాఖ రాజధాని విషయంలో వైసీపీ వెనక్కి తగ్గిందని చేస్తున్న విష ప్రచారానికి బ్రేకులు వేసేలా వైఎస్ జగన్ తాజా వ్యాఖ్యలు ఉన్నాయని అనుకుంటున్నారట. ఏది ఏమైనా ఈ మాటలతో ఏపీ సీయం విశాఖవాసుల్లో కొత్త ఆశలు నింపారని, మళ్లీ ఎలక్షన్లు వచ్చేలోపల రాజధాని నిర్ణయం దాటవేయకుంటే చాలని అనుకుంటున్నారట ఈ విషయంలో విసిగిపోయిన ప్రజలు..