రమణ దీక్షితులు తో వై ఎస్ జగన్ అత్యవసర భేటీ..?

Is YS Jagan playing with Rayalaseema sentiments

రమణ దీక్షితులు అనే పేరు ఏపీ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా ఎక్కువుగా వినిపిస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడుపై ఘాటు వ్యాఖ్యలు చేసిన రమణ ఇప్పుడు వైసీపీపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. కరోనా విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని, ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైందనే వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. అయితే ఇప్పుడు జగన్ పై తన పంథాను మార్చి తనకు సహాయం చేయాలని ట్వీట్స్ చేస్తున్నారు.

తనకు మళ్ళీ ప్రధాన అర్చకుడి హోదా తనకు ఇవ్వాలని, ఇవ్వకపోతే తిరుగుబాటు చేస్తాననే స్వరంతో మొదట్లో జగన్ పై విరుచుకుపడ్డారు.

కానీ ఇప్పుడు సీఎంగారూ.. మీరే న్యాయం చెప్పాలంటూ.. ట్విట్టర్ ద్వారా వేడుకుంటున్నారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా తనను నియమించమని మీరు టీటీడీ అధికారులను ఆదేశించినా బేఖాతరు చేస్తున్నారని ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు. అయితే రమణ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన మైండ్ గేమ్ అడుతున్నాడని ఎవరికైనా అర్ధమవుతుంది. ఎందుకంటే రమణదీక్షితులకు గౌరవ ప్రధాన అర్చకులు పదవి మాత్రమే ఇవ్వాలన్నది ప్రభుత్వ నిర్ణయం కాబట్టి ఆ పదవి ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆయన ప్రధాన అర్చకుడిగా నియమించాలని జగన్ ను కోరుతున్నారు. మొన్నటి వరకు హెచ్చరికలు జారీ చేసిన రమణ ఇప్పుడెందుకు ఇలా ప్లేట్ మార్చడంటే టీటీడీ చైర్మన్‌గా ఉన్నది స్వయంగా జగన్మోహన్ రెడ్డి సమీప బంధువే. వైసీపీ వ్యవహారాలు చక్కబెట్టే వ్యూహకర్తల్లో ఒకరు. ఇప్పుడు తనను ప్రధాన అర్చకుడిగా నియమించాలంటే జగన్ ఆదేశాలు కూడా అవసరమని భావించిన రమణ ఇలా ప్లేట్ మార్చారు. అయితే రమణ చేస్తున్న వ్యాఖ్యల వల్ల తనకు ఒక నియోజక వర్గం ప్రజల్లో తనకు చెడ్డ పేరు వస్తుందని భావించిన జగన్ రానున్న రోజుల్లో రమణతో సమావేశం అయ్యే అవకాశం ఉందని వైసీపీ నాయకులు చెప్తున్నారు.