ఈ ‘నోటి’ దరిద్రాన్ని వైఎస్ జగన్ ఆపగలరా.?

డౌటేముంది.? ఇది ముమ్మాటికీ నోటి దరిద్రమే.! అన్నం తింటున్నారా.? అశుద్ధం తింటున్నారా.? అని జనం నిలదీస్తున్న పరిస్థితిని వైసీపీ నేతలు ఎందుకు కొనితెచ్చుకుంటున్నట్లు.? ప్రధానంగా మాజీ మంత్రి కొడాలి నాని వ్యవహార శైలి, వైసీపీకి మచ్చ తెస్తోంది. స్వయంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ మంత్రి కొడాలి నానితో అడ్డగోలు వ్యాఖ్యలు చేయిస్తున్నారనేలా జనంలోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయి.

చంద్రబాబుపైనా, ఆయన తనయుడు లోకేష్ పైనా గత కొంతకాలంగా కొడాలి నాని చేస్తున్న విమర్శలు ఓ యెత్తు.. నారా లోకేష్ పుట్టుక మీద కొడాలి నాని తాజాగా చేస్తున్న జుగుప్సాకరమైన వ్యాఖ్యలు ఇంకో యెత్తు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద టీడీపీ నేతలు చేస్తున్న విమర్శల తీవ్రత తక్కువేమీ కాదు. కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యల ముందర, టీడీపీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలు చాలా చాలా చిన్నవిగా జనానికి కనిపిస్తున్నాయి.

అంతలా కొడాలి నాని చెలరేగిపోతున్నారు. వీటి వల్ల వైసీపీకి అదనంగా ఒక్క ఓటు వచ్చి పడేలా లేదు సరికదా, వున్న ఓటు బ్యాంకుని గల్లంతు చేసేలా పరిస్థితులు మారిపోతున్నాయి.

‘ఏమో, ముందు ముందు వైసీపీ ప్రభుత్వం, ఎవరికి ఎవరు తండ్రి.. అనే విషయమై సర్టిఫికెట్లు జారీ చేసేలా కొత్త సంక్షేమ పథకం ఏమైనా ప్రవేశ పెడుతుందేమో..’ అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ స్థాయికి కొడాలి నాని, వైసీపీ ప్రభుత్వ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసి పడేస్తున్నారు.

‘నువ్వెవడికి పుట్టావ్ రా..’ అంటూ కొడాలి నాని మీద కొందరు టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారంటే, ఆ దుస్థితిని కొడాలి నాని తనకు తానుగా కొనితెచ్చుకున్నారు.

దురదృష్టమేంటంటే, కొడాలి నాని నోటి తీట కారణంగా, పై ప్రశ్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద కూడా వేస్తున్నారుట టీడీపీ నేతలు. వున్నపళంగా వైఎస్ జగన్, కొడాలి నాని మీద ‘అదుపు’ చర్యలు చేపట్టకపోతే.. అంతే సంగతులు.!