వైఎస్ జగన్ వైసీపీని అధికారంలోకి తేవడానికి ఎంతగా శ్రమించాడో అందరికి తెలిసిందే.. ఎట్టకేలకు సీయం పీఠాన్ని ఎక్కిన తర్వాత పార్టీ బలోపేతం కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు తీసుకుంటున్నారు కూడా.. అయితే రాజకీయం అనే గాలి సోకితే అంత సులువుగా వదలదు కదా.. మరి పదవులకు ఉన్న ఆయస్కాంత శక్తి అంత బలమైనది.. అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రస్తుత కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే రానున్న ఎన్నికల్లో అంటే రెండోసారి కూడా వైసీపీని అధికారంలోకి తేవడానికి పావులు కదుపుతున్నారు వైఎస్ జగన్.. ఇలా ఏదోరకంగా 2024 ఎన్నికల్లోనూ వైసీపీ జెండాను రెపరెపలాడించాలి అనే ప్రణాళికలో భాగంగా ఇప్పటి నుంచే ఎక్కడా రాజీ పడకుండా, అన్ని వ్యవహారాలను సక్రమంగా చక్కబెట్టుకుంటూ, ప్రజల్లో పారదర్శకంగా ప్రభుత్వం పని చేస్తుందనే అభిప్రాయం కలిగిస్తున్నారు..
అయితే ప్రతిపక్షం కత్తులు దూస్తున్న, కవ్వింపు చర్యలు చేపడుతున్న సమయస్పూర్తిగా వ్యవహరిస్తూ వస్తున్నారు.. అంతే కాకుండా కేంద్ర అధికార పార్టీ బీజేపీతోనూ, సఖ్యతగా మెలుగుతూ, తనకు ఏ ఇబ్బంది లేకుండా చేసుకుంటూ వ్యవహారం నడిపిస్తున్నారు. ఇదే సమయంలో రానున్న రోజుల్లో ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీతో తమకు ఇబ్బందులు తప్పవని గ్రహించి ఆ పార్టీని బలహీనం చేసేందుకు ఎన్నో ఎత్తులు వేస్తున్నారు.. ఇందులో భాగంగా వలసలను ప్రోత్సహిస్తున్నారు.. వైఎస్ జగన్ ప్లాన్ బాగానే వర్కవుట్ అయ్యి భారీగానే టీడీపీ పార్టీ నుండి నేతలు జంప్ అయ్యారు.. అవుతున్నారు.. మరి కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలా టీడీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా సైతం పోగొట్టే విధంగా జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
ఇక నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల స్థాయిలో ఓటర్లను ప్రభావితం చేయగలిగిన నాయకులందరినీ ఇప్పుడు వైసీపీలోకి చేర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంతవరకు బాగానే ఉంది.. కానీ కొందరు మాత్రం ఇలా కొత్తగా వలసలు వచ్చే వారు ఎక్కువైతే ప్రస్తుతం ఉన్న వారికి రానున్న రోజుల్లో తమ రాజకీయ భవిష్యత్తు కు ఇబ్బంది ఏర్పడుతుందని, ఇలా ఎన్నో లెక్కలు వేసుకుంటున్నారట. ఇలా చేరికలకు అడ్డుపడుతున్నారనే విషయాలు వైఎస్ జగన్ వరకు వెళ్లగా, తాను పార్టీని బలంగా తయారు చేస్తుంటే తన తాపత్రయం అర్థం చేసుకోకుండా పార్టీ నాయకులు తన నిర్ణయాలకు అడ్డుపడుతున్నారనే అభిప్రాయం కలిగిన, బయటపడకుండా ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో దృష్టి పెడితే గాని సెట్ అవ్వదని వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది..
అయితే ఇదే విషయంలో ఇప్పటికే కొంత మంది ఎమ్మెల్యేలకు, మంత్రులకు అధిష్టానం పెద్దలు గట్టిగానే క్లాస్ పీకీనట్లు సమాచారం.. మరి ఈ విషయంలో వైఎస్ జగన్‌కే జలక్ ఇస్తూ, సీన్ రివర్స్ చేసున్న నాయకుల విషయంలో వైఎస్ జగన్ ఏం నిర్ణయిస్తారో వేచిచూడాలి..