J.C Prabhakar Reddy: ఇప్పటికైనా మారు జగన్ …. రాజకీయ సమాధి కావద్దు…. జేసీ సంచలన వ్యాఖ్యలు!

J.C Prabhakar Reddy: తాడిపత్రి మున్సిపల్ కార్పొరేషన్ చైర్ పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ మీడియా సమావేశంలో భాగంగా ఈయన వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ఈ సందర్భంగా జెసి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డికి కొన్ని కీలక సూచనలు చేశారు. కడపలో టిడిపి నిర్వహించిన మహానాడు కార్యక్రమానికి వెళ్తే అక్కడికి వచ్చిన జనాన్ని చూసి నేను ఒక్కసారిగా షాక్ అయ్యానని తెలిపారు. అక్కడికి వచ్చింది నేతలు కాదు సామాన్య కార్యకర్తలని తెలిపారు. అక్కడికి వచ్చిన జనాలని చూసి నా మైండ్ బ్లాక్ అయిందని తెలిపారు.

జగన్ నువ్వు బాగా కావలసిన వ్యక్తివి. మీ అమ్మ తాడిపత్రి నుంచే వచ్చారు. నాకు బాగా నచ్చిన నాయకులు ముగ్గురు మాత్రమే ఉన్నారు. అందులో మీ నాన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఒకరు. ఆయన చాలా మంచివారు. ఎక్కడ కనిపించిన చిరునవ్వులు చిందిస్తూ అందరితో మాట్లాడేవారు. వైయస్ గారు అందరిని ఆప్యాయంగా పలకరించేవారు కానీ నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు అధికారం పోగానే తిరిగి అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నావ్.

నువ్వు రాజకీయాల పరంగా ఇప్పటికైనా మారకపోతే నీకు రాజకీయ సమాధి తప్పదని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. అదేవిధంగా నారా లోకేష్ పై జెసి ప్రశంశల వర్షం కురిపించారు. నారా లోకేష్ ముఖ్యమంత్రి కొడుకు అని గర్వం లేకుండా మంత్రులతో ఎమ్మెల్యేలతో కార్యకర్తలతో మమేకమవుతున్నారు. లోకేష్ ఎంతో గొప్ప చదువులు చదువుకున్న వ్యక్తి అయినప్పటికీ ప్రజలతో కలిసిపోయే వ్యక్తిత్వం లోకేష్ ది ఇలాంటి వ్యక్తికి ఒక గొప్ప ఫ్యూచర్ ఉంటుందని లోకేష్ పై ప్రశంసల వర్షం కురిపించారు.