గ్రూపు రాజకీయాలకు అడ్డాగా మారుతున్న వైసీపీ.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ?

jagan telugu rajyam

 

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్ది ప్రజలకు చేరువ కావడానికి పాదయాత్ర చేసి ప్రజల మనసుల్లో స్దానం సంపాదించుకుని సీయం పీఠాన్ని ఎక్కాడు.. ఇదే దారిలో వెళ్లిన ఆయన తనయుడు వైఎస్ జగన్ కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొని, అప్పటి అధికార పార్టీ టీడీపీ ఎత్తులను చిత్తు చేస్తూ ప్రజల బలాన్ని కూడ గట్టుకుని తన పార్టీ అయినా వైసీపీని అధికారంలోకి తెచ్చి తాను సీయం అయ్యాడు.. ప్రజల మనసులకు దగ్గరైతే వారే అందలం ఎక్కిస్తారని నిరూపించాడు వైఎస్ జగన్.. ఇంతవరకు బాగానే ఉంది.. చంద్రబాబు అధికారంలో ఉండగా తాను ఎదుర్కొన్న అవమానాలు, కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. ఇలా ఎలాగైనా తాను అధికారంలోకి రావాలనుకొన్న వైఎస్ జగన్ చివరకు అనుకున్నది సాధించాడు..

chandrababu jagan telugu rajyam
chandrababu jagan telugu rajyam

కానీ టీడీపీని పూర్తిగా ఏపీలో భూస్ధాపితం చేయాలనే సంకల్పంతో వలసలను ప్రోత్సహించడం మొదలు పెట్టాడు.. అయితే ఏపీలో 175 స్థానాల్లో తిరుగులేని మెజారిటీ సాధించిన వైసీపీకి తెలుగుదేశం పార్టీ నాయకులను తన పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేయడం అవసరమా అని అనుకుంటున్నారట ఈ మధ్య కాలంలో గ్రూపు రాజకీయాలతో విసిగిపోతున్న నాయకులు.. ఇప్పటికే వైసీపీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోతుంటే వాటిని చక్కదిద్దడం మానేసి,టీడీపీకి చెందిన వారిని పార్టీలో చేర్చుకుని, మరిన్ని గ్రూపు రాజకీయాలకు తెర తీయడం అత్యవసరమా అనే గుసగుసలు వైసీపీలో వినిపిస్తున్నాయట. ఈ నేపధ్యంలో వైఎస్ జగన్ మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీని బలహీనం చేయడం ఒక్కటే ప్రధాన ధ్యేయంగా పెద్ద ఎత్తున టీడీపీలోని కీలకమైన నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తూ, చేరికలను ప్రోత్సహిస్తున్నారు.

ఇక దాదాపుగా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా ఉన్న నాయకులు అంతా వైసీపీలోకి వచ్చేసారు. ఇంకా కొంతమంది రావడానికి ఎదురు చూస్తున్నారు.. ఇకపోతే ఏపీలో పునర్విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ స్థానాలను పెంచాలని వైఎస్ జగన్ కేంద్ర పెద్దలను కోరినట్టు సమాచారం.. దీనికి వారు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఆ ఉద్దేశంతోనే నాయకుల చేరికలకు ఈ విధంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.. ఏది ఏమైనా మొట్టమొదట గ్రూపు రాజకీయాల విషయాన్ని పరిష్కరిస్తే బాగుంటుందనే అభిప్రాయం కొందరి నాయకుల్లో కలుగుతుందట.. లేదంటే చివరకు పార్టీకే నష్టం వస్తుందంటున్నారు.. మరి చూడాలి ఈ విషయంలో వైఎస్ జగన్ ఎలా స్పందిస్తారో..