పోలవరం విషయంలో కూడా జగన్ ప్రభుత్వం బీజేపీకి భయపడుతోందా!కేంద్రాన్ని ఎదురించి పోరాడే దమ్ము జగన్ లేదా!!

2019 ఎన్నికల్లో రాజకీయ అంశంగా మారిన అంశాల్లో పోలవరం కూడా ఒకటి. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి పార్టీ కూడా పోలవరం నిర్మాణాన్ని పూర్తి చెయ్యడానికి పతకాలు తయారుచేసి మేనిఫెస్టోలో చేర్చారు. అయితే ఇప్పుడు ఎన్నికలు పూర్తి అయ్యాయి కదా ఇక పోలవరంను రాజకీయ పార్టులు పట్టించుకోవడం లేదు. అధికారంలోకి వచ్చిన వైసీపీ నాయకులు, సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పోలవరం నిర్మాణాన్ని పూర్తి చెయ్యడానికి చిత్తశుద్ధిని కనపరచడం లేదు. ప్రత్యేక హోదా విషయంలో కూడా ఎలాగైతే మొదట కేంద్రం మెడలు వంచి సాధిస్తామని చెప్పి తరువాత కేంద్ర పెద్దల పాద పూజకు దిగారో ఇప్పుడు పోలవరం విషయంలో కూడా కేంద్రంపై వైసీపీ పోరాడలేకపోతుంది.

కేంద్రానికి జగన్ అంతలా భయపడుతున్నారా!

ఏపీ ప్రభుత్వ నిరస్సహాయతను ఆసరాగా చేసుకుని కేంద్రం ఆటలు ఆడటం వల్ల పోలవరం సందిగ్ధంలో పడింది. బాధ్యత నుంచి తప్పుకోవడానికి కేంద్రం చేయాలనుకున్నదంతా చేస్తోంది. ఇప్పటి వరకూ ఇచ్చింది చాలు.. ఇక ఇచ్చేది లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వంలోనే రూ. 52వేల కోట్ల ప్రతిపాదనలకు పోలవరం టెక్నికల్ కమిటీ ఆమోదం తెలిపింది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం కేవలం 20వేల కోట్లు ఇస్తామనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై కేంద్రంపై పోరాడాల్సిన జగన్ ప్రభుత్వం లేఖల రాజకీయాన్ని ప్రారంభించింది. కేంద్రంపై పోరాడాల్సిన సమయంలో కేంద్ర పెద్దలకు జగన్ కు ఎందుకు భయపడుతున్నారని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై కేంద్రంతో పోటీకి దిగితే జగన్ కు రాజకీయంగా కూడా మైలేజ్ పెరుగుతుంది కానీ ఎందుకు ముందుకు వెళ్లడం లేదో ఎవ్వరికి అర్ధం కావడం లేదు. ఎదురుతిరిగితే మళ్ళీ జైల్ కు వెళ్లాల్సి వస్తుందని భయపడుతున్నాడేమోనని ప్రజలు భావిస్తున్నారు.

చెడు టీడీపీకి మంచి వైసీపీకి

రాష్ట్రానికి సంబంధించి మంచి జరిగితే అది వైసీపీ ఖాతాలోకి, చెడు జరిగితే అది టీడీపీ ఖాతాలోకి వెయ్యడం వైసీపీ నాయకులకు అలవాటైంది. ఇప్పుడు పోలవరం విషయంలో కూడా కేంద్రం పెట్టిన షరతుకు టీడీపీ కారణమని వైసీపీ నాయకులు చెప్తున్నారు. ప్రజలు వైసీపీకి ఘన విజయం ఇచ్చింది సాకులు చెప్పి తప్పించుకోవడానికి కాదు పోరాడి రాష్ట్రానికి మంచి చెయ్యడానికి కానీ వైసీపీ పెద్దలు మాత్రం సాకులు చెప్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారు.