నెల్లూరు:ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న కొత్త జిల్లాల ఏర్పాటు అభివృద్ధి కోసమని వైసీపీ నాయకులు చెప్తున్నారు. అయితే దీని వెనక చాలా పెద్ద రాజకీయ ఎత్తుగడ కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ జిల్లాల విభజనతో కొంత మంది టీడీపీ నాయకుల రాజకీయ జీవితానికి జగన్ ఎండ్ కార్డ్ ప్లాన్ చేయనున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. జగన్ టార్గెట్ చేసిన టీడీపీ నాయకుల్లో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒకరు.
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గత కొన్ని సంవత్సరాల నుండి ఓటమి పాలు అవుతున్నారు. వరుసగా నాలుగు సార్లు నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజక వర్గం నుండి ఓడిపోగా, ఒకసారి కొవ్వూరు నుండి కూడా ఓటమిని చవి చూశారు. సర్వేపల్లి నియోజవర్గంలో సోమిరెడ్డికి బలమున్నప్పటికి, సామాజిక వర్గం మద్దతు ఉన్నప్పటికీ ఓటమి మాత్రం తప్పడం లేదు. వరుసగా ఓటమి పాలు అవుతున్న సోమిరెడ్డికి జిల్లాల విభజన మరిన్ని కష్టాలు తెస్తుంది.
జిల్లాల విభజన జరిగితే సర్వేపల్లి నియోజక వర్గం తిరుపతి జిల్లాలోకి వెళ్లనుంది. సర్వేపల్లి నియోజక వర్గం తిరుపతిలో కలిస్తే అక్కడ ఆల్రెడీ ఉన్న వైసీపీ నాయకులైన భూమన కరుణాకర్‌రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి లాంటి బలమైన నేతల నుంచి కూడా సోమిరెడ్డికి పోటీ తప్పదు. జిల్లాల విభజన తరువాత వైసీపీ నాయకుల ధాటికి సోమిరెడ్డి నిలబడుతారో కాలం నిర్ణయిస్తుంది. ప్రస్తుత రాజకీయంలో జగన్ వేసిన చాణుక్య ప్లాన్ కు సోమిరెడ్డితో పాటు ఎంతమంది నాయకుల రాజకీయ జీవితం మారనుందో వేచిచూడాలి.