జగన్ లేఖాస్త్రం స్ట్రాటజీ వర్కవుట్ అయింది.. సర్వేలో  సంచలన నిజాలు 

వైఎస్ జగన్ న్యాయవ్యవస్థలో లోపాలున్నాయని, జస్టిస్ ఎన్వీ రమణ తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని  ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి దేశవ్యాప్త సంచలనానికి తెరతీశారు.  ఈ అంశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  ప్రభుత్వమేమో కోర్టుల ద్వారా ప్రభుత్వ కార్యకలాపాల, సంక్షేమ  పథకాల అమలుకు అడ్డుతగులుతున్నారని, దీని వెనుక చంద్రబాబు కుట్ర దాగుందని వాదిస్తుంటే, చంద్రబాబు నాయుడు మాత్రం జగన్ అవినీతి  కేసులు విచారణకు వచ్చాయని, వాటిలో త్వరలోనే ఆయనకు శిక్ష పడనుందని, దానికి భయపడే ఆయన న్యాయవ్యవస్థ మీద దాడికి తెగబడ్డారని అంటున్నారు.  

YS Jagan letter to give good results to him 
YS Jagan letter to give good results to him 

రాజకీయ విశ్లేషకులు మాత్రం జగన్ లేఖాస్త్రం వెనుక పెద్ద స్ట్రాటజీ ఉందని, దాని మూలంగా ఆయనకు అపారమైన హీరోయిక్  ఇమేజ్ వచ్చే అవకాశం ఉందని, ఈ యుద్ధంలో గెలిచినా ఓడినా జగన్ ఛరీష్మా రాష్ట్ర ప్రజల్లో విపరీతంగా పెరగడం ఖాయమని అంటున్నారు.  వీటిలో ఏది నిజన్నది తెల్లాలంటే జనాభిప్రాయం ముఖ్యం కదా.  అందుకే ‘తెలుగురాజ్యం డాట్ కామ్’ టీమ్ జగన్ లేఖాస్త్రం మీద ఆన్ లైన్ పోల్ సర్వే నిర్వహించడం జరిగింది.  అందులో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి.

YS Jagan letter to give good results to him 
YS Jagan letter to give good results to him 

అసలు జగన్ న్యాయవ్యవస్థలో లోపాలున్నాయని లేఖ రాయడం  సమంజసమేనా అనే ప్రశ్నకు ఓట్లు వేసినవారిలో 60 శాతం మంది అవును జగన్ చేసేది కరెక్టే అంటూ ఓటు వేయగా ఇంకో 32 శాతం మంది మాత్రం చంద్రబాబు చెబుతున్నట్టు కేసులకు భయపడే దాడి చేస్తున్నారనే వాదనకు ఓటు వేశారు.  మిగిలిన 9 సాతమంది ఏది నిజం అనేది న్యాయవ్యవస్థే తేల్చాలని కోరుతూ ఓటు వేశారు.  అంటే మెజారిటీ ఓటర్లు జగన్ చేసిన పనిని సమర్థిస్తూ ఓటు వేశారు.  అంటే ఈ యుద్ధంలో జగన్ గెలవాలని, ఆయనదే పైచేయి కావాలని మెజారిటీ జనం అనుకుంటున్నారు.  ఒకవేళ ఈ యుద్ధంలో జగన్ ఎదురుదెబ్బతిన్నా ఆయనకు సానుభూతి దొరకడం ఖాయం.  మొత్తానికి జగన్ స్ట్రాటజీ బాగానే వర్కవుట్ అయిందన్నమాట.