‘ టార్గెట్ సబ్బం హరి ‘ జగన్ కొత్త ప్లాన్ ఇదేనా ?

sabbam hari

2019 ఎన్నికల్లో గెలిచిన వైసీపీ ప్రభుత్వం టీడీపీ నాయకులను ఒక్కొక్కరికి టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి టీడీపీ నాయకులు కూడా వైసీపీ నాయకులను ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ కూడా అదే పంథాను కొనసాగిస్తోంది. ఇప్పటికే అనేకమంది నాయకులపై వైసీపీ ప్రభుత్వం తన ప్రతాపాన్ని చూపగ, కొంతమంది నాయకులు ఆ ప్రతాపాన్ని తట్టుకోలేక, భయపడి వైసీపీ బాట పట్టిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు విశాఖ టీడీపీ నేత సబ్బం హరిని వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని తెలుస్తోంది.

Jagan latest target sabbam hari
Jagan latest target sabbam hari

జగన్ లేటెస్ట్ టార్గెట్ సబ్బం హరి

సబ్బం హరి కాంగ్రెస్ లో ఉంటూ రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. తమ నాయకుడు రాజీవ్ గాంధీని ఏదో అన్నాడని ఆగ్రహించి నాటి తెలుగుదేశం మంత్రి అశోక్ గజపతి రాజును విశాఖ ఎయిర్ పోర్టులో అడ్డుకుని ఆయన కారు డోర్ పట్టుకుని కొంత దూరం ప్రయాణం చేసి అలజడి సృష్టించిన సంచలన చరిత్ర ఆయనకు ఉంది. తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి దయతో 2009 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా గెలిచారు. ఆ తరువాత ఆయన వైసీపీకి మద్దతు ఇస్తూ జగన్ కు అండగా నిలుచున్నారు. అయితే 2014 ఎన్నికల సమయానికి టీడీపీ చెంతకు చేరి భీమిలి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆయన ఇప్పటికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతూ…జమిలి ఎన్నికలు వస్తే గెలుపు టీడీపీదేనని ధీమా వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు సబ్బం హరిని వైసీపీ టార్గెట్ చేసింది. ఎప్పుడో ఆయన ఆక్రమించి కట్టుకున్న ఇంటిని ఇపుడు హఠాత్తుగా గుర్తుకొచ్చినట్లుగా జీవీఎంసీ అధికారులు ఒక్క పోటుతో దానిని కూల్చేశారు. దీని మీద సబ్బం హరి మాట్లాడుతూ తనకు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చుతారు అంటూ మండిపడ్డారు. అయితే ఇది మునిసిపాలిటీకి చెందిన స్థలం అని పన్నెండు అడుగులు ఆక్రమించి మరీ ముందుకు సబ్బం హరి అక్రమ నిర్మాణాలు చేశారని అధికారులు అంటున్నారు.

ఇది ఆరంభం మాత్రమే

సబ్బం హరిపై జరుగుతున్న దాడుల్లో ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో మరిన్ని జరగనున్నాయని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. హరి మేయర్ గా ఉండగా అయిదేళ్ల పాలనలో చేసిన అక్రమాలు ఒక్కోటీ బయటకు తీస్తామని వైసీపీ నాయకులు చెబుతున్నారు. తమ నేత మీద ప్రభుత్వం తీసుకున్న కక్ష సాధింపు చర్య ఇది అని సబ్బం హరి అనుచరులు అంటున్నారు. దీని మీద తేల్చుకుంటామని చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను టీడీపీ నాయకులు ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.