వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన కొంత సమయంలో వివిధ రకాల పథకాలను ప్రవేశపెట్టారు. అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో ఇన్ని పథకాలు ప్రవేశపెట్టడం కేవలం జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమవుతుందని ప్రజలు చెప్తున్నారు. అయితే నిన్న మరో సరికొత్త పథకానికి జగన్ శ్రీకారం చుట్టారు. ఈ పథకానికి వైఎస్ఆర్ చేయూత అని పెరు పెట్టారు. ఈ పథకం ద్వారా 46 ఏళ్లు దాటిని ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలు ఆర్థికంగా ఎదిగేలా, వారికి అన్ని విధాలా ఆదుకునేందుకు జగన్ ఈ పథకాన్ని తెరమీదికి తెచ్చారు. ప్రస్తుతం ఆయా వర్గాలకు చెందిన మహిళలు ఓ వయసుకు వచ్చిన తర్వాత కుటుంబంలో ఆదరణ కోల్పోతున్నారు. పోనీ సొంతకాళ్లపై నిలబడాలన్నా కూడా వారికి అప్పుడు లభించే ఆదరణ అంతంత మాత్రమే.
అలాంటి వారిని ఆదుకోవడానికే ఈ పథకం ప్రవేశపెట్టామని వైసీపీ నేతలు చెప్తున్నారు. జగన్ పాద యాత్ర చేస్తున్నప్పుడు మహిళలు ఈ ప్రతిపాదనను తన వద్దకు తీసుకువచ్చారని జగన్ తెలిపారు. అప్పుడే ఈ మహిళలను ఆదుకోవడానికి నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. ఈ పథకం ద్వారా ఏటా మహిళలకు 18750 రూపాయలను వారి వారి ఖాతాల్లో వేయనున్నారు. అంతేకాదు, వారికి పెట్టుబడులుగా వినియోగించే సొమ్ముతో పాటు అమూల్, రిలయన్స్, ప్రొక్టర్ అండ్ గేంబెల్ సంస్థలతోనూ ఒప్పందాలు చేసుకున్నారు. అయితే ఈ పథకంపై టీడీపీ నేత నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. డ్వాక్రా మహిళల్ని కోటీశ్వరుల్ని చేస్తానని పావలా వడ్డీ పేరుతో మీ నాయన ఐదేళ్లలో 268 కోట్లు విదిల్చాడు, నువ్వేమో నెలకు 3000 చొప్పున ఐదేళ్లు ఇస్తామని సగం కోసి నెలకు 1500 లెక్కన నాలుగేళ్లకే పరిమితం చేశావని, మీ నాయనది నయవంచన, నీది విశ్వాసఘాతుకం, మీ వంశమే మోసానికి ప్రతిరూపం అని నిరూపించుకున్నావని కామెంట్స్ చేశాడు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఈ పథకం వల్ల మహిళల జీవితాల్లో వెలుగులు ఖాయమని అంటున్నారు.