వైజాగ్ గీతం వ్యవహారం ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కలకలం రేకెత్తిస్తోంది. నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు ఐన భారత్ పగ్గాలు చేపడుతున్న గీతం యూనివర్సిటీ ప్రహరీ కూల్చివేత సంఘటన గురించే డిస్కషన్ లు నడుస్తున్నాయి.
గీతం కబ్జా చేసిందని చెపుతున్న 40 ఎకరాలను ఒక్కో ఎకరా మార్కెట్ ధర ప్రకారం 8 .5 కోట్లు చెల్లించి తీసుకోమని ప్రభుత్వం తెలిపినట్లు, దానికి గీతం యాజమాన్యం సమాధానం ఇవ్వకపోవటంతో, అక్కడ నిర్మించిన కొన్ని కట్టడాలను విశాఖ అధికారాలు నేలమట్టం చేయటం జరిగిందని తెలుస్తుంది. దీనితో టీడీపీ లో అలజడి రేగింది.
అక్కడ అమరావతి లో దెబ్బతిని, ఇక్కడ విశాఖలో ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉండటంతో ఏమి చేయాలో పాలుపోవటం లేదు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు, రాజకీయ పార్టీ కి ఆర్థిక పరిపుష్టి లేకపోతే నడవటం చాలా కష్టం. అది గమనించే జగన్ టీడీపీ ఆర్థిక శక్తులపై సమరశంఖం పురిస్తున్నాడు అంటున్నారు మరికొందరు.
[poll id=”14″]