ఏ రాష్ట్రంలో లేనంత స్ట్రాంగ్ నిఘా పెట్టిన జగన్ ఈ మ్యాటర్ చాలా సీరియస్ గా తీసుకున్నారు

Reddy community request to CM YS Jagan

వైసీపీ ప్రభుత్వానికి పాలనా పరంగా ఎన్నో అడ్డంకులు వస్తున్నా కూడా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. కొన్ని రోజుల క్రితం వైఎస్ఆర్ చేయూత పథకం, నిన్న 15000 గ్రామంలో డిజిటల్ లావాదేవీలను ప్రారంభించారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం మరొక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ల్యాండ్ రిజిస్ట్రేషన్ లో జరుగుతున్న అక్రమాలను అడ్డుకోవడానికి నూతన విధానాన్ని ప్రవేశపెట్టనుంది. స్థలాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను వీడియో రికార్డింగ్‌ చేయాలని నిర్ణయించింది. ఈమేరకు వీడియో రికార్డింగ్, పర్యవేక్షణకు ఏర్పాట్లు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వీడియో రికార్డింగ్‌తో పాటు పర్యవేక్షణకు రెవెన్యూశాఖ కార్యాచరణను రూపొందిస్తోంది. ప్రయోగాత్మక‌ ప్రాజెక్టుగా 20 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వీడియో రికార్డింగ్‌ ప్రక్రియను మొదటగా ప్రారంభించనున్నారు.

రాష్ట్ర స్థాయిలోని కంట్రోల్ రూమ్ తో వీటిని పర్యవేక్షించనున్నారు. ఈ విధానం వల్ల ల్యాండ్ వివాదాలకు కళ్లెం వేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ విధానం వల్ల అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను కూడా పట్టుకోవడానికి సులువుగా ఉంటుంది. నిజానికి ల్యాండ్ అక్రమాలు నిరోధించడానికి గతంలో కూడా ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేశాయి. అయితే అమలు చేయడంలో విఫలమయ్యాయి. కానీ జగన్ మాత్రం ఈ కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరీ అమలుకు కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టి భూ అక్రమాలను రానున్న రోజుల్లో అరికడుతుందని వైసీపీ నాయకులు చెప్తున్నారు. ప్రభుత్వానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా పట్టించుకోకుండా ప్రజల క్షేమం కోసం జగన్ కృషి చేస్తున్నారని వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో రానున్న రోజుల్లో రెవిన్యూ శాఖలో భారీ మార్పులు రానున్నాయని, భూముల విషయంలో ప్రజలకు పూర్తి న్యాయం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.