ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ప్రస్తుతం ఉన్న ఆదరణను ప్రతిపక్షాల నాయకులు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికే జగన్ ను దెబ్బతీయడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ నేతలు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ జగన్ కు ప్రజల్లో ఉన్న ఆదరణ మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఆయన చేస్తున్న, ప్రవేశ పెడుతున్న పథకాలను ప్రజల్లో ఆదరణ పీక్స్ లో ఉంది. అయితే ఇప్పుడు జగన్ పై బీజేపీ- టీడీపీ నాయకులు బ్లాక్ మెయిల్ రాజకీయాలను ప్రారంభించారు.
కేసీఆర్ ను అడ్డుపెట్టుకున్న సీబీఎన్
ఆంధ్రప్రదేశ్ లో 2019లో జరిగిన ఎన్నికల సమయంలో కేసీఆర్ ఆంధ్ర రాజకీయాల్లో చేసిన హడావిడి అంత ఇంతా కాదు. వైసీపీ ని సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడుని తీవ్రంగా విమర్శించారు. అయితే గత కొన్ని రోజుల నుండి జగన్ కు కేసీఆర్ కు అస్సలు పడటం లేదు. ఈ గోడవను ఇప్పుడు చంద్రబాబు నాయుడు తనకు అనుకాలంగా మార్చుకోవడానికి చూస్తున్నాడు.
తెలంగాణలో గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ సీబీఎన్ కలిసిపోతే జగన్ కు ఇబ్బందులు తప్పవు. కేసీఆర్ మాటల ధాటికి జగన్ ఇమేజ్ చాలా వరకు దెబ్బ తింటుంది.
సీబీఎన్ ను అడ్డుపెట్టుకున్న బీజేపీ
జగన్ తో చ్లొసె అవ్వడానికి బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. కానీ జగన్ మాత్రం వల్ల స్నేహం అవసరం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు బీజేపీ సీబీఎన్ తో మళ్ళీ పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. సీబీఎన్ కు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తుపెట్టుకుంటే వైసీపీకి ఇబ్బందులు తప్పవు. మొత్తానికి జగన్ కి ఇపుడు అగ్ని పరీక్షే. తాను అనుకున్నట్లుగా కచ్చితంగా ఉంటే నిజంగా కొత్త పొత్తులతో చంద్రబాబు చెలరేగిపోతారేమోనని భయం. అలాగని బంధాలు గట్టి పరచుకుంటే రేపటి రోజున తన రాజకీయ పునాదులకే ఇబ్బందులు వస్తాయేమోనని కూడా ఆందోళన. మొత్తానికి చంద్రబాబు మళ్లీ జగన్ కి విలన్ గా ముందుకు వస్తున్నారు.