2019 ఎన్నికల్లో వైసీఎప్ విజయం సాధించి ఇప్పటికే దాదాపు రెండు సంవత్సరాలు పూర్తి కావొస్తుంది. ఇప్పటికే ఆయన పాలన పట్ల ప్రజలకు ఇంకా పూర్తి అవగాహన రాలేదు. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కరోనా రావడంతో దాంతో అసలు పాలన ఎలా సాగిందో ఎవ్వరికీ తెలియడం లేదు. అయితే ఆయన ముందు చెప్పినట్టే తన మంత్రి వర్గాన్ని మాత్రం మార్చడానికి పూర్తిగా సిద్ధమయ్యారు. అయితే ఈసారి మార్పులు కేవలం పనితీరు ఆధారంగానే ఉన్నాయని తెలుస్తుంది.
అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించని వారిని, పార్టీ కోసం పని చెయ్యని వారిని సీఎం వైఎస్ జ్ జగన్మోహన్ రెడ్డి తొలగించనున్నారు. అవినీతి ఆరోపణలున్న మంత్రులతో పాటు పనితీరు బాగా లేని మంత్రులను తొలగించేందుకు జగన్ సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఇందుకోసం సామాజిక వర్గాల సమీకరణాల ఆధారంగా కూడా జగన్ ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు. జిల్లాలు, సామాజికవర్గాల ఆధారంగా ఈసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటున్నారు. గత పదిహేడు నెలల్లో ఒకరిద్దరు మంత్రుల మీద తప్పించి ఎవరిపై అవినీతి ఆరోపణలు రాలేదు.
కార్మిక శాఖమంత్రి గుమ్మనూరి జయరాంపైనే ఇప్పటి వరకూ ఆరోపణలు వచ్చాయి. అది కూడా విపక్ష తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేసింది. దీంతో గుమ్మనూరి జయరాంకు ఉద్వాసన తప్పదు. అలాగే పనితీరు బాగాలేని మంత్రుల్లో తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఉన్నారు. వీరిద్దరూ తమ శాఖను పట్టించుకోకపోవడమే కాకుండా, పార్టీ విషయాలను కూడా పక్కనపెట్టారని అధిష్టానం గుర్తించింది.
ఇప్పటివరకు ఎలాంటి ఆరోపణలు ఎదుర్కొని వారికి మాత్రం మళ్ళీ అవకాశం ఇవ్వనున్నారని సమాచారం. అలాగే టీడీపీ నుండి వైసీపీలోకి వస్తున్న వారికి కూడా ఛాన్స్ ఇవ్వనున్నారని సమాచారం. ఇలా చేస్తే ఇంకొంతమందిని పార్టీలోకి లాగవచ్చన్న పతకం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.