విశాఖ త్వరలో పాలన రాజధాని కానుంది. దీంతో ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న విశాఖ రాజకీయాలు చాలా వెడెక్కాయి. ఎవరికి వారు తమ ప్రయోజనం పొందాలని తపించిపోతున్నారు. పొలిటికల్ పార్టీలేమే విశాఖ మీద పట్టు పేంచుకోవాలని చూస్తుంటే నేతలు సొంత లాభం ఏమిటో చూసుకునే పనిలో ఉన్నారు. విశాఖ ఇప్పటికే అభివృద్ది చెందిన సిటీ. ఆ అభివృద్ది క్రమంలో ఎంతో మంది కళ్లు అక్కడి భూముల మీద పడ్డాయి. ఇప్పటికే చాలావరకు భూములు ఆక్రమణలకు, కబ్జాలకు గురయ్యాయని అంటున్నారు. కాలక్రమంలో జరిగిన దందాలు కాబట్టి ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అన్ని పెద్ద పార్టీల నుండీ లీడర్లు ఇందులో ఉంటారు.
విశాఖ రాజకీయాలను మొదటి నుండి శాసిస్తున్నది బయటి వ్యక్తులే. విశాఖ ప్రజలకు బయటి నుండి రాజకీయం చేయడానికి వచ్చే నేతలను ఆదరిస్తారనే మాట ఉంది. అది నిజమే. ఈరోజు విశాఖ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న వారిలో ఎక్కువమంది బయటి వ్యక్తులే. లోకల్ లీడర్లు చాలా సున్నితంగా ఉండటంతో సెటిలర్లు గట్టిగా పాతుకుపోయారు. అసలు సగం వైజాగ్ సెటిలర్ల చేతుల్లోనే ఉంది. ఇప్పుడు రాజధాని కానుంది కాబట్టి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున భూములు అవసరం. కానీ అంత భూమి లేదు. ఎక్కువ శాతం వ్యక్తుల చేతుల్లోనే ఉంది. వారిలో పొలిటికల్ లీడర్లు, వారికి కావలసిన వ్యక్టులు ఉన్నారు.
వారంతా భూములను అక్రమంగా సొంతం చేసుకున్నవారేనని, అలా చేసుకున్న వారిలో వైసీపీ నేతలు కూడ ఉన్నారని, ముందు వారి నుండి భూములను విడిపించాలని డిమాండ్ వినిపిస్తోంది. దీంతో ప్రభుత్వం దురాక్రమణకు గురైన భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొస్తామని అంటోంది. ఈ పనిని జగన్ విజయసాయిరెడ్డికి అప్పగించారట. ఆయన ప్రక్షాళన తమ పార్టీ నేతల నుండే మొడలుపెడతామని, తమవారు ఎవరైనా ఆక్రమణలకు పాల్పడి ఉంటే వాటిని స్వాధీనం చేసుకుంటామని అన్నారు. ఈ పని చెప్పినంత ఈజీ కాదు. సొంత పార్టీ వ్యక్తులను, మద్దతుదారులను కంట్రోల్ చేయడం తలనొప్పి వ్యవహారం. ఎన్నో చిక్కులు, సిఫార్సులు, మొహమాటాలు ఉంటాయి. వాటి మధ్య ఆక్రమణ భూములు బయటకి రావాలి. అందుకే సీఎం జగన్ తెలివిగా ఈ పనిని విజయసాయిరెడ్డి భుజాల మీద పెట్టేశారని టాక్.