వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి దాదాపు 16 నెలలు గడుస్తుంది. కానీ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదు. ఎందుకంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా కోర్ట్ ల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 100సార్లు కోర్ట్ ల నుండి మొట్టికాయలు జగన్ ప్రభుత్వానికి పడ్డాయి. అందుకే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా పాలన విషయంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఫాలో అవుతున్నారు. చంద్రబాబు పాలనా విధానాన్ని ఫాలో అవుతున్న జగన్ మోహన్ రెడ్డి దానికి తన టచ్ కూడా ఇస్తున్నారు.
ఏ విషయంలో జగన్ బాబును ఫాలో అవుతున్నారు!
2014 ఎన్నికల్లో అనుభవం ఉన్న వ్యక్తి కదని ఏపీ ప్రజలు టీడీపీకి అధికారం కట్టబెట్టారు. అప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఐదేళ్లలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టకుండా సమయం, ప్రభుత్వ ఆదాయాన్ని నాశనం చేశారు. తన అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ ను వాడుకున్నారు. అమరావతిలో జరగని అభివృద్ధిని కూడా గ్రాఫిక్స్ ద్వారా చూపిస్తూ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేసి 2019 ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డాడు. అలాగే ఇప్పుడు మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న జగన్ కూడా చంద్రబాబు నాయుడు ఫాలో అయిన గ్రాఫిక్స్ విధానాన్ని ఫాలో అవుతున్నారని సమాచారం. మూడు రాజధానులు సంబంధించిన గ్రాఫిక్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే విశాఖలో వైసీపీ ప్రభుత్వం గెస్ట్ హౌస్ నిర్మాణాన్ని చెప్పడానికి పూనుకునప్పటికి సుప్రీం హెచ్చరించడంతో ఆపేసింది. అయితే దీని నిర్మాణానికి సంబంధించిన గ్రాఫిక్స్ కోసం మాత్రం జగన్ ప్రభుత్వం 25 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. జగన్ ఎదో చేస్తాడని ప్రజలు అధికారం ఇచ్చారు కానీ జగన్ కూడా చంద్రబాబు నాయుడులా మోసం చేస్తున్నాడని ప్రజలు వాపోతున్నారు.
అభివృద్ధి చేసే ఆలోచన నాయకులకు లేదా!
ఏపీలో నాయకులు ఒకరిని ఒకరు తిట్టుకోవడానికి చూపించిన్నంత ఇంట్రెస్ట్ అభివృద్ధిపై చూపించడం లేదు. వాళ్లకు ఆరోపణల మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇచ్చిన హామీలను ఆచరణలో పెట్టె ఉద్దేశం లేదు. గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించి మోసం చేశాడు, ఇప్పుడు జగన్ అడ్డమైన నిర్ణయాలు తీసుకుంటూ కోర్ట్ ల చుట్టూ తిరుగుతున్నాడు. రాజకీయ నాయకులు అభివృద్ధిని పక్కన పెట్టి ఓట్లు వేసిన ప్రజలను వెదవలను చేస్తున్నారు. నాయకులు మాటలతో కాలక్షేపం చేయకుండా అభివృద్ధిపై ఇంట్రెస్ట్ పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.