వైజాగ్ వెళదామని అన్ని ప్లాన్ లు వేసుకున్న జగన్ కి ఇలా జరిగింది ఏంటి ?

2019 ఎన్నికల్లో గెలిచిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల్లో మూడు రాజధానుల అంశం ముఖ్యమైనది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలో సృష్టిస్తున్న సంచలనం గురించి అందరికి తెలిసిందే. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తాము కూడా అడ్డుకోలేమని కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. అయితే మూడు రాజధానుల అంశంను వ్యతిరేకిస్తున్న అమరావతి రైతులు హై కోర్ట్ లో కేసులు వేయడంతో వైసీపీ ప్రభుత్వం యొక్క నిర్ణయం తాత్కాకలికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల అంశానికి మరో అడ్డంకి వచ్చింది.

విశాఖకు వచ్చిన కొత్త ఇబ్బంది ఏంటి?

వరదలు వస్తే కర్నూల్ మునిగిపోయిన సంఘటనలు చూస్తున్నాము, అలాగే తుఫానులు వల్ల విశాఖ ఇబ్బందులు పడటం కూడా గతంలో చూశాం. అయితే టీడీపీ అధికారంలో ఏర్పాటు చేసిన అమరావతికి కృష్ణా నదికి ఎంత పెద్ద వరద వచ్చినా ఏమి కాలేదు. ఈ విషయం ఇప్పుడు జగన్ కు చమటలు పట్టిస్తోంది. ఎందుకంటే వరదల్లో చిక్కుకునే ప్రాంతాల్లో, తుఫానులు వచ్చే ప్రాంతాల్లో రాజధానులను ఏర్పాటు చేయడం ఎందుకని ప్రజల నుండి కొత్త వాదన ఈ మధ్య కాలంలో బయటకు వస్తుంది. నిజమే, వైఎస్‌ జగన్‌ హయాంలో కృష్ణా నదికి అతి పెద్ద వరద గత ఏడాది వచ్చింది. ఇప్పుడూ దాదాపు అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ, అమరావతిలో ఎక్కడా ఒక్క ఎకరం కూడా ముంపు ప్రాంతంగా కనిపించడంలేదన్నది స్థానికంగా వెల్లువెత్తుతున్న అభిప్రాయం. గతంలో అమరావతికే వరదల ముప్పు ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే అయితే ఇప్పుడు ప్రజల నుండి వస్తున్న ఈ కొత్త వాదనకు వైసీపీ నాయకులు ఎలా సమాధానం చెప్తురో వేచి చూడాలి.

అమరావతి రైతులను జగన్ కనికరించడా !

మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు తమఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం వాళ్ళను అస్సలు పట్టించుకోవడం లేదు. అసలు అక్కడ రైతులు ఉన్నారనే విషయాన్ని కూడా మర్చిపోయి వైసీపీ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. ఎలాగో విశాఖ, కర్నూల్ ల కంటే కూడా తక్కువ వరదలు, తుఫానులు ముప్పు ఉంది కాబట్టి ఇక్కడే రాజధానిని నిర్మించి తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం జగన్ రైతులతో చర్చలకు సిద్ధమవుతున్నారని వార్తలు వచ్చాయి కానీ ఇప్పటి వరకు అది నిజం కాలేదు. మరి రైతుల పట్ల జగన్ ఎప్పుడు కనికరం చూపిస్తారో వేచి చూడాలి.