తనకు ఉన్న ఏకైక జీవనాధారం సినిమాలే అంటూ సినీ రంగంలోకి దూకారు పవన్ కళ్యాణ్. రీఎంట్రీ ఇవ్వడంతోనే ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎగబడ్డారు. సినీ ప్రపంచంలో పవన్ కు ఉన్న భారీ క్రేజ్ మూలానా హెవీ రెమ్యునరేష్ ఇవ్వడానికి కూడ నిర్మాతలు వెనుకాడట్లేదు. పవన్ సైతమ్ దొరికిందే తడవుగా భారీగా అడ్వాన్సులు పుచ్చుకుని సినిమాలకు పచ్చ జెండా ఊపారు. గత ఏడాదిన్నరగా ఈ ప్రాసెస్ నడుస్తుండగా ఆయన కంప్లీట్ చేసింది ‘వకీల్ సాబ్’ చిత్రం మాత్రమే. మధ్యలో లాక్ డౌన్ పట్టడం మూలాన సినిమాలు ఆలస్యమయ్యాయి. ఇక ఈ నెల మధ్య నుండి పావంరెండు సినిమాలను ఒకేసారి మొదలుపెట్టనున్నారు. వాటిలో ఒకటి క్రిష్ చిత్రం కాగా ఇంకొకటి ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్.
ఈ రెండు సినిమాలను ఒకేసారి చేయాలని పవన్ భావిస్తున్నారు. ఈ రెండింటి తర్వాత హరీష్ శంకర్, త్రివిక్రమ్ సినిమాలు చేయాల్సి ఉంది. ఇలా ఈ సినిమాలు అన్నింటికీ కలిపి పవన్ రెమ్యునరేష్ 250 కోట్లకు పైమాటే. ప్రజెంట్ పవన్ డైలీ పేమెంట్ తీసుకుంటున్నారు. రోజులు కోతికి పైగానే ఛార్జ్ చేస్తున్నారు. అందుఎక్ సినిమాలు 30 నుండి 40 రోజుల మధ్యలో డేట్స్ మాత్రమే ఇస్తున్నారు. అలా ఒక్కొక సినిమాకు 50 కోట్ల వరకు పారితోషకం తేలుతోంది.
ఈ 250 కోట్లలో వరకు అడ్వాన్సుల రూపంలో పుచ్చుకుని ఉంటారట ఆయన. అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలంతా అరచేతిలో ప్రాణాలు పట్టుకుని కూర్చుకున్నారు. ఎందుకంటే పవన్ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ఒక్కోసారి ఉన్నట్టుండి షూటింగ్ పెట్టమంటారు. ఇంకోసారి ఉన్నపళంగా పార్టీ పనుల్లోకి వెళ్ళిపోతారు. దీంతో తెచ్చిన అప్పుయిలకు వడ్డీలు పెరిగిపోతాయనే కంగారులో ఉన్నారు నిర్మాతలు.
పవన్ సైతం డబ్బు పుచ్చుకున్న నిర్మాతలకు త్వరగానే సినిమాలు చేసి పెట్టాలనే ఉద్దేశ్యంతోనే ఉన్నా కూడ కుదరట్లేదు. ఎందుకంటే రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. అన్ని పార్టీలు ఎవరికీ వారు వ్యూహాలు రచించుకుని రాబోయే ఎన్నికల కోసం సిద్దమవుతున్నారు. మరీ ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా వేగంగా ఉన్నారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలతో జనంలోకి దూసుకెళ్తున్న ఆయన ఈమధ్య ఉచిత ఇళ్ల పట్టాలు, ఇళ్ళు ఇస్తున్నారు. అవి గనుక క్లిక్ అయితే ఆయన్ను ఆపడం ఎవరి తరమూ కాదు. గత ఎన్నికల్లో వీచిన ఫ్యాన్ గాలికే జనసేన వణికిపోయింది. ఇక ఈసారి తుఫాన్ గాలి వీస్తే ఎటు వెళ్లిందో కూడ కనుక్కోవడం కష్టం. కాబట్టి ఇప్పటి నుండి బలపడితేనే 2024నాటికి వైసీపీని తట్టుకోవడం సాధ్యమవుతుంది.
మరి బలపడాలంటే ఏం చేయాలి.. 24 ఘటనలు పార్టీ కోసమే కష్టపడాలి. కానీ పవన్ ఐదారు సినిమాలకు సైన్ చేసి ఉండటంతో రానున్న రెండేళ్లలో ఆయన ఎక్కువ సమయం పార్టీ కోసం కేటాయించలేకపోవచ్చు. అప్పుడు చివరి ఏడాదిన్నర ఎంత కిందా మీదా పడినా ప్రయోజనం ఉండదు. అలాగని ఇప్పుడు సినిమాలను వదిలి రాలేరు. ఈ మీమాంసలో పవన్ అటు ప్రశాంతంగా సినిమాలు చేసుకోలేక ఇటు పూర్తిస్థాయిలో పార్టీకి సమయం కేటాయించలేక నానా అవస్థలు పడుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయు సినిమాలకు ఇటు వైఎస్ జగన్ కు మధ్యలో నలిగిపోతున్నారాయన.