టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి..వెనుక గొయ్యి అన్న చందంగా మారిందా? రాజకీయంగా చంద్రబాబు అండ్ కో బలహీన పడిందా? ప‌్రస్తుత పరిస్థితులు బాబుకు ఎంత మాత్రం అనుకూలంగా లేవా? అంటే అవుననే తెలుస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడ్ని సొంత పార్టీ నేతలే నమ్మే పరిస్థితుల్లో లేరు. ఉన్న 20 మంది ఎమ్మెల్యేలు ఆయన వెంట ఎంత మంది ఉంటారో ? కూడా తెలియని అనిశ్చితి ఏర్పడింది. గంటా శ్రీనివాసరావు సహా పలువురు సీనియర్లు, జూనియర్లు వైకాపా వైపు చూస్తున్నారన్నది వాస్తవం. టీడీపీ నేతలపై అరెస్ట్ లు కావొచ్చు…చేసిన అవినీతిని కప్పి పుచ్చుకోవడానికి కావచ్చు కారణం ఏదైనా ఇప్పుడున్న నేతలంతా సేఫ్ జోన్ లో ఉండాలని ఎవరి ప్రయత్నాల్లో వారు బీజీ అయ్యారు.
రాబొయే రోజుల్లో చంద్రబాబు ఒక్కరే ఒంటిరి పోరాటం తప్ప సమిష్టి పోరాటం అనే మాట ఎక్కడా వినిపించకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు చంద్రబాబు ఢిల్లీ నుంచి వ్యవహారలు నడింపించే వారు. ఆయనకంటూ అక్కడ ఓ వర్గం ఉండటంతో కొన్నాళ్ల పాటు అది చెల్లుబాటు అయింది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నది అందరికీ తెలిసిందే. అందుకే చంద్రబాబు మొదటి నుంచి ఢిల్లీకి దూరంగా ఉంటూ ఏపీలోనే ఉంటూ ఏడాదిగా తాను చేయాలనుకున్నది చేస్తూ వచ్చారు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలని చంద్రబాబు రాజకీయంగా ఎలా వాడాలో అలా వాడేసారు.
దెబ్బ తిన్న తర్వాత గాయం బాధ ఎంటో తెలుస్తుందన్నట్టు బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలకి చంద్రబాబు అసలు రూపం ఏంటన్నది ఆ గాయం తర్వాతే తెలిసింది. ప్రస్తుతం టీడీపీ – బీజేపీ తో పూసుకోవాలని ప్రయత్నం చేస్తున్నా…ఆ పార్టీ దగ్గరకు రానివ్వడం లేదు. ఓ వైపు ఏపీలో బీజేపీ చంద్రబాబు స్థానంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చంద్రబాబు టార్గెట్ గా ఆపరేషన్ మొదలు పెట్టింది. చంద్రబాబు పై జనసేనకు ఎక్కడో చిన్న సాప్ట్ కార్న్ ఉన్నా బయటకు గట్టిగా చెబితే ఆ పార్టీ బరస్ట్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా అతని పక్షాన నిలబడే ఛాన్స్ ఎంత మాత్రం లేదు. ఇలా చంద్రబాబు అన్ని రకాలుగా అష్టదిగ్భందనం అయినట్లే కనిపిస్తోంది.