టీడీపీని ముంచడానికే గంటా రాజీనామా ?

Master plan behind Ganta resignation 
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.  అధికార, ప్రతిపక్షాలు రాజీనామాలు చేసి పోరాడాలని ఒకరి మీద ఒకరు సవాళ్లు విసురుకుంటున్న నేపథ్యంలో గంటా రాజీనామా చేయడం సంచలనం రేపింది.  పరిశ్రమ కోసం మొదటగా రాజీనామా చేసిన నేతగా గంటా పేరును చెప్పుకున్నారు.  గంటా కూడ పార్టీలకు అతీతంగా పోరాడి ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటానని అంటున్నారు.  అయితే గంటా రాజీనామా ఆమోదం పొందే ప్రసక్తే లేదని బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు అనడం సంచలనం రేపింది.  గంటా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేశారని, అది ఆమోదం పొందదని ఆయన అంటున్నారు. 
 
Master plan behind Ganta resignation
విశ్లేషకులు సైతం ఇదే మాట చెబుతున్నారు.  కొన్నిరోజులు పోయాక స్పీకర్ నుండి రాజీనామా లేఖ రిజెక్ట్ అయినట్టు సందేశం వస్తుందని చెబుతున్నారు.  ఇదంతా ఒక రాజకీయ ఎత్తుగడ అని, కేవలం పార్టీ మారడానికే గంటా ఈ వ్యూహం ఎంచుకున్నారని అంటున్నారు.  గంటా కొన్నాళ్లుగా వైసీపీలోకి వెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నారు.  కానీ వైసీపీలోనే కొన్ని శక్తులు అడ్డుపడటంతో అది కుదరలేదు.  వస్తే రాజీనామా చేసి రావాలని కండిషన్ పెట్టారు.  దీనికి విశాఖ ఉక్కు వివాదం కలిసొచ్చిందట.  కేవలం పార్టీ మారడానికి రాజీనామా చేస్తే జనంలో చులకన అవుతామని, అందుకే ఉక్కు పరిశ్రమ కోసం చేస్తున్నారు రాజీనామా చేసేసి పార్టీ మారిపోవాలని ఆయన అనుకుంటున్నారట. 
 
అంతేకాదు స్థానిక ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పనిచేసి జగన్ కు దగ్గరకావాలని చూస్తున్నారట.  ఇప్పటికే తన శ్రేణులకు వైసీపీని గెలిపించాలని సంకేతాలు ఇచ్చేశారని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి.  అంతెందుకు విష్ణు కుమార్ రాజు మాటలు వింటుంటే స్థానిక ఎన్నికల్లో వైసీపీ అనుకూలంగా పనిచేసి ఎన్నికలు పూర్తవగానే ఆ పార్టీలోకి చేరిపోతారని, రాజీనామా లేఖ పంపి ఉన్నారు కాబట్టి ఆయనకు మిగతా  వారిలా కాకుండా అఫీషియల్ ఎంట్రీ దొరుకుంటుందని, ఆ తర్వాత ఎలాగూ ఆ రాజీనామాను స్పీకర్ ఆమోదించారు కాబట్టి ఆయన మళ్ళీ ఎమ్మెల్యే హోదాలోకి వచ్చేస్తారని, అప్పటికి వైసీపీలోకి వెళ్ళిపోయి ఉంటారు కాబట్టి అధికారికంగా వైసీపీ ఎమ్మెల్యే అయిపోతారని చెబుతున్నారు.  ఈ తంతు మొత్తంలో దెబ్బతినేది ఉత్తర నియోజకవర్గం టీడీపీయేనని కూడ అంటున్నారు.