టీడీపీని వెంటాడుతున్న ’23’ సెంటిమెంట్…ఆ నెంబర్ వింటనే వణుకు !

Kamma community disappointed with Chandrababu Naidu

రాజకీయాల్లో కూడా సెంటిమెంట్స్ కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కోసారి సెంటిమెంట్ ను లక్కీగా భావిస్తే.. కొంతమందికి అస్సలు సెంటిమెంట్ కలిసి రావడం లేదని భయపడుతూ ఉంటారు. ఇప్పుడు టీడీపీ నేతలను కూడా అలాంటి సెంటిమెంట్ భయపెడుతోంది. అసలు ఆ నెంబర్ వింటుంటేనే టీడీపీ నేతలు గజ గజా వణికిపోతున్నారు. ఒకప్పుడు ఎన్డీయే కన్వీనర్‌ గా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు చంద్రబాబు.. ఏపీ రాజకీయాల్లోనూ ఆయనది తిరుగులేని ముద్ర.. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం. అలాంటి చంద్రబాబుకు 23వ నెంబర్‌ అస్సలు కలిసిరావడం లేదు.

chandrababu-bluff-statements-about-ap-municipal-elections

23 అనే నెంబర్‌ వినిపిస్తే చాలు తెలుగు తమ్ముళ్లు అమ్మో అనే పరిస్థితి నెలకొంది. అందుకు అనేక కారణాలున్నాయి. మళ్లీ మరోసారి ఆ నెంబర్ ఇప్పుడు టీడీపీ కేడర్ ను భయపెడుతోంది. వైసీపీకి చెందిన చెందిన 23 మంది ఎమ్మెల్యేలను.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీలోకి ఆహ్వానించారు. అప్పటి నుంచి అది 23 నెంబర్‌ సంక్షోభంగా మారింది. ఇదే అంశం గతంలో తీవ్ర చర్చనీయాంశంగా కాగా… ఇప్పుడు మరోసారి నెంబర్‌ 23 హాట్‌ టాపిక్‌గా నిలిచింది. ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబును ఈనెల 23న విచారణకు ఆదేశించడమే అందుకు ప్రధాన కారణం.

2014 ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత. 23మంది వైసీపీ ఎమ్మెల్యేలకు టీడీపీ కండువా కప్పారు. తరువాత 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున అదే 23 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. విశేషమేంటంటే ఎన్నికల ఫలితాలు కూడా మే 23నే వచ్చాయి. ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా భంగపడింది. అద్భుత విజయం సాధించిన తరువాత 23 సెంటిమెంట్‌ను సీఎం జగనే స్వయంగా గుర్తు చేశారు. దేవుడు గొప్ప స్క్రిప్ట్‌ రాశాడంటూ ఈ 23నే ఆయన బలంగా నొక్కి చెప్పారు. మండలి రద్దును కూడా సీఎం జగన్ జనవరి 23నే ప్రకటించారు. ఇప్పుడు అమరావతి భూముల వ్యవహారంలో చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 23న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.