ఉయ్యూరు శ్రీనివాస్ గొప్పోడు.. తప్పు చేసినా ఎల్లో మీడియా క్షమించేసిందిగా?

ఏపీలోని రెండు పత్రికలకు వైసీపీ మంచి పనులు చేసినా చెడ్డగా టీడీపీ చెడ్డ పనులు చేసినా మంచిగా కనిపిస్తాయనే సంగతి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గుంటూరు జిల్లాలో తాజాగా ముగ్గురు చనిపోవడానికి ఉయ్యూరు శ్రీనివాస్ అనే వ్యక్తి కారణమనే సంగతి తెలిసిందే. కొన్నిరోజుల క్రితం వరకు ఎవరికీ పెద్దగా తెలియని ఈ వ్యక్తి గుంటూరు ఘటన వల్ల ఓవర్ నైట్ లో వార్తల్లో నిలిచారనే సంగతి తెలిసిందే.

సరైన విధంగా ఏర్పాట్లు చేసి ఉంటే ఆరోజు ఒక్కరి ప్రాణం కూడా పోయేది కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎల్లో మీడియా మాత్రం ఉయ్యూరు శ్రీనివాస్ గొప్ప వ్యక్తి అనే విధంగా కథనాలు ప్రచారం చేస్తోంది. ఉయ్యూరు శ్రీనివాస్ విదేశీ విద్యకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాడని సొంత ఖర్చుతో అన్న క్యాంటీన్లను నిర్వహిస్తున్నాడని సొంత నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాడని ఎల్లో మీడియా చెబుతోంది.

అయితే తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం చేకూరేలా ఉయ్యూరు శ్రీనివాస్ పని చేస్తుండగా ఏ స్వార్థం లేకుండా ఉయ్యూరు శ్రీనివాస్ పని చేస్తున్నట్టు చెప్పడం గమనార్హం. ముగ్గురు అమాయకుల మరణానికి ఉయ్యూరు శ్రీనివాస్ కారణమైనా ఎల్లో మీడియా మాత్రం గొప్ప మనస్సుతో క్షమించేసిందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో విలువలను మరిచి కొంతమంది రాజకీయాలు చేస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

చంద్రబాబు నాయుడు ఇకపై సభలను నిర్వహించే సమయంలో తొక్కిసలాట జరగకుండా జాగ్రత్త పడాల్సి ఉంది. సొంతంగా సెక్యూరిటీని నియమించి ఈ తరహా ఘటనలు రిపీట్ కాకుండా చేస్తే మంచిది. ఈ తరహా ఘటనల వల్ల చంద్రబాబు ప్రజల్లో చులకన అవుతున్నారు. పబ్లిసిటీతో ఎన్నికల్లో విజయం సాధించడం జరగదని చంద్రబాబు గ్రహిస్తే మంచిదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.