మీ పిల్లలు ప్రతి రోజు కడుపు నొప్పి అంటూ బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించండి!

చిన్నపిల్లలు పెద్దవారు అని వయసు వ్యత్యాసం లేకుండా తరచూ వేధించే ఆరోగ్య సమస్యలలో కడుపు నొప్పి ఒకటి. ముఖ్యంగా చిన్నపిల్లల ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఆహారం తినటం లేదా తిన్న ఆహారం జీర్ణం అవకపోవడం వల్ల సాధారణంగా కడుపు నొప్పి సమస్య మొదలవుతుంది.

ప్రస్తుత కాలంలో పిల్లలు జంక్ ఫుడ్ ఎక్కువగా తినటానికి అలవాటు పడిపోతున్నారు. వాటిని తినడం వల్ల ఇన్ఫెక్షన్ కలిగి కడుపు నొప్పి వాంతులు విరేచనాలు వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు మనం కడుపునొప్పి తగ్గించడానికి ఇంటిలో ఉపయోగించే చిట్కాల గురించి తెలుసుకుందాం.

కడుపునొప్పి తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం వల్ల వస్తుంది. అటువంటి సమయంలో పిల్లలకు కొంచెం వాము దోరగా వేయించి దానిని పోడి చేసి గోరువెచ్చని నీటితో కల్పి తాగించడం వల్ల కడుపునొప్పి నుంచి విముక్తి పొందవచ్చును. వాముని నీటిలో బాగా ఉడికించి వామ్ వాటర్ తయారుచేసుకుని నిల్వ చేసుకోవచ్చు. వామ్ వాటర్ తాగించటం వల్ల పిల్లల్లో కడుపు నొప్పి సమస్య తగ్గుతుంది.

ఇంట్లో మనం తీసుకునే ఆహారం కచ్చితంగా పెరుగు ఉంటుంది. పెరుగుని ఉపయోగించి కడుపు నొప్పి అరికట్టవచ్చు. పెరుగులో తిన్న ఆహారాన్ని జీర్ణం చేసే శక్తి ఉంటుంది. పెరుగు జీర్ణక్రియను మెరుగు పరిచి తిన్న ఆహారం తొందరగా అరగడానికి సహాయపడుతుంది.

అల్లం, బెల్లం కలిపి తీసుకుని కొడుపులో నొప్పి(pain) తగ్గించవచ్చు.అల్లంలో ఉండే యాంటీ ఇంఫ్లామేటరీ లక్షణాల వల్ల ఇది జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇలా ఈ చిట్కాలను ఉపయోగించి కడుపు నొప్పి సమస్యలు తొందరగా తగ్గించుకోవచ్చు.